ఈ స్కూల్ పిల్లల్లో ఓ స్టార్ హీరోయిన్ ఉంది.. ఎవరో కనిపెట్టండి చూద్దాం.!
సినిమా తారాలకు సంబంధించిన ఫోటోలుఎం వీడియోలు సోషల్ మీడియాలో చాల వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ కు సంబందించినవి. తమ అభిమాన హీరోయిన్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు ఫ్యాన్స్ ఎంతో ప్రేమగా పదిలంగా దాచుకుంటూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్ లో ఆ ఫోటోలను షేర్ చేస్తూ హడావిడి చేస్తుంటారు.

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అందాల తార. దక్షిణాది చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో ఈ అమ్మడు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సరసన ఈ వయ్యారి నటించిన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఆ సినిమాలోని సాంగ్స్ నెట్టింట దూసుకుపోతుంటాయి. ఆ ఒక్క మూవీతో అమ్మాడి క్రేజ్ మారిపోయింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ.. చీరకట్టులో సంప్రదాయ దుస్తుల్లో నటిస్తూనే అభిమానులను సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ వయ్యారి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.. ఎవరో గుర్తుపట్టండి. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిల్లో మన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఉంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్రలు చేసింది.
తనే ఒక్కప్పుడు కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ మీరా జాస్మిన్. కోలీవుడ్ స్టార్ విశాల్ నటించిన పందెం కోడి చిత్రంతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో లంగావోణిలో అచ్చం పల్లెటూరి అమ్మాయి పాత్రలో యాక్టింగ్ అదరగొట్టింది. ఓణి వేసిన దీపావళి వచ్చిందా మా ఇంటికి పాటతో చాలా ఫేమస్ అయ్యింది మీరా జాస్మిన్. సూత్రదారన్ (2001) అనే మలయాళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన మీరా.. అమ్మాయి బాగుంది సినిమాతో నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
2014లో దుబాయ్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటస్ ను వివాహం చేసుకున్నా మీరా.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. మకల్ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీరా.. తెలుగులో విమానం మూవీతో అలరించింది. ప్రస్తుతం యాక్టింగ్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




