AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైకోర్టులో నాగార్జునకు ఊరట.. కీలక ఉత్తర్వులు జరీ చేసిన న్యాయస్థానం

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫొటోలు, పేరును వాడుకోకుండా.. ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై తాజాగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టులో నాగార్జునకు ఊరట.. కీలక ఉత్తర్వులు జరీ చేసిన న్యాయస్థానం
Nagarjuna
Rajeev Rayala
|

Updated on: Oct 01, 2025 | 12:37 PM

Share

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫొటోలు, పేరును వాడుకోకుండా.. ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే నాగార్జున పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కారియా విచారించారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన కంటెంట్‌లో.. అలాగే వస్తువులు, దుస్తులపై తన చిత్రాన్ని అనధికారికంగా ఉపయోగించడం ద్వారా.. తన వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘిస్తున్నారని నాగర్జున తరపున న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు.

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తున్న భామ..! ఎవరో తెలుసా.?

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అక్కినేని నాగార్జున వ్యక్తిత్వ హక్కులను కాపాడతామని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇటీవల ఐశ్వర్యారాయ్‌ విషయంలోనూ హైకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. అక్కినేని నాగర్జునకు కూడా ఊరట లభించనుందని పేర్కొన్నారు లాయర్లు..

లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్

సినీ నటుడు నాగార్జున పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారి చేసింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది ఢిల్లీ హైకోర్టు. నాగార్జున ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. ఏఐ, జెఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.

మంచి కొడుకును కాలేకపోయా.. జీవితం అయిపోయిందని బాధపడ్డా.. ఎమోష్నలైన షణ్ముఖ్ జశ్వంత్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..