Ram Charan: ‘లియో’ సినిమాలో రామ్ చరణ్ ?.. విజయ్ దళపతి కోసం మెగాపవర్ స్టార్..
ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దళపతి విజయ్ హీరోగా లోకేష్ తెరకెక్కిస్తోన్న లియో రెండో సినిమా కావడంతో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. లోకేశ్ కనగరాజ్ తమిళంలో తనదైన సినీ విశ్వాన్ని సృష్టించారు. అంటే ఒక సినిమాలోని పాత్రలకు మరో సినిమాకు లింక్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా విశ్వరూపంలో రామ్ చరణ్ కూడా చేరే అవకాశం ఉందనే అనుమానం కలుగుతోంది. అందుకు కారణాలు లేకపోలేదు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'లియో' సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది.

దళపతి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘లియో’ సినిమా విడుదలకు మరికొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో ఈ సినిమాపై పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దళపతి విజయ్ హీరోగా లోకేష్ తెరకెక్కిస్తోన్న లియో రెండో సినిమా కావడంతో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. లోకేశ్ కనగరాజ్ తమిళంలో తనదైన సినీ విశ్వాన్ని సృష్టించారు. అంటే ఒక సినిమాలోని పాత్రలకు మరో సినిమాకు లింక్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా విశ్వరూపంలో రామ్ చరణ్ కూడా చేరే అవకాశం ఉందనే అనుమానం కలుగుతోంది. అందుకు కారణాలు లేకపోలేదు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘లియో’ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది.
ఇప్పటికే కొన్ని చోట్ల టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. అమెరికా టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో రామ్ చరణ్ పేరు కనిపించింది. నటీనటుల జాబితాలో చరణ్ పేరు చేర్చబడింది. దాంతో ఈ సినిమాలో దళపతి విజయ్‌తో పాటు రామ్ చరణ్ కూడా నటించి ఉంటాడని చాలా మంది అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై చిత్ర బృందం అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
.@AlwaysRamCharan ft #Leo 🧊🔥@Dir_Lokesh @7screenstudio @MrRathna @anirudhofficial #GameChanger pic.twitter.com/y4D5YIuTUP
— #LEO OFFICIAL (@TeamLeoOffcl) October 10, 2023
ఎన్నో అంచనాల మధ్య రూపొందిన ‘లియో’ సినిమా ట్రైలర్ లో కొన్ని అంశాలు హైలెట్ అయ్యాయి. ఇది తమిళ సినిమా. అయినప్పటికీ, దాని ట్రైలర్‌లో తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్‌తో కూడిన కారు కనిపిస్తుంది. ఈ కారు రామ్ చరణ్ క్యారెక్టర్ కి సంబంధించినదని కొందరి అంచనా. అయితే అది నిజమో కాదో సినిమా విడుదలైన తర్వాతే తెలియాల్సి ఉంది.
Unleashing my @actorvijay na in a never seen before avatar 🔥💯#LeoTrailer
Tamil: https://t.co/yVnAVolBUh
Telugu: https://t.co/ppRRPK6TLX
Kannada: https://t.co/zvrRp1yvB7#LeoFromOctober19#LEO 🔥🧊
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 5, 2023
అమెరికా సినిమా టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ ‘లియో’లో రామ్ చరణ్ పేరును ఉంచడం, ట్రైలర్‌లో తెలంగాణకు చెందిన కారు కనిపించడంతో ఈ మూవీలో చరణ్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటించాడని వార్తలు వచ్చాయి.
The High Octane #LeoTrailerFromOct5 🔥#LeoFromOctober19#LEO 🔥🧊 pic.twitter.com/V1xub8pIM3
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




