Prabhas: ‘నా కల నెరవేరింది.. ఇది నా అదృష్టం’.. ఇన్ స్టాలో ప్రభాస్ ఆసక్తికర పోస్ట్..
ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ సినిమా పై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేసింది. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే దీపికా, ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఈరోజు (అక్టోబర్ 11) అమితాబ్ బర్త్ డే కావడంతో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ తన కల నెరవేరిందంటూ రాసుకొచ్చారు ప్రభాస్.

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో కల్కి ఒకటి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ఇదివరకు ఎన్నడు కనిపించని పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు. అంతేకాదు డార్లింగ్ కెరీర్లోనే ఎప్పుడూ టచ్ చేయని జోనర్ ఇది. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ సినిమా పై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేసింది. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే దీపికా, ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఈరోజు (అక్టోబర్ 11) అమితాబ్ బర్త్ డే కావడంతో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ తన కల నెరవేరిందంటూ రాసుకొచ్చారు ప్రభాస్.
అక్టోబర్ 11న అమితాబ్ 81వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో కల్కి చిత్రయూనిట్ సైతం బర్త్ విషెస్ తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో అమితాబ్ లుక్ ఆకర్షిస్తోంది. గుహలో సూర్య కిరణాల వెలుగు మధ్య ఒళ్లంతా.. ముఖాన్ని గుడ్డతో కప్పుకుని .. చేతిలో కర్ర చెయ్యెత్తు మనిషిలా నిలబడి ఉన్నారు బిగ్. ఆయన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పోస్టర్ ను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ బిగ్ బీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
View this post on Instagram
“కొన్ని తరాలకు స్పూర్తినిచ్చిన ఒక లెజండ్ తో కలిసి పనిచేయడం నాకు దక్కిన వరం. నిజంగా కల నెరవేరడం అంటే ఇదే. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్” అంటూ రాసుకొచ్చారు. కల్కి సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది.
It’s an honor to be part of your journey and witness your greatness. Happy Birthday @SrBachchan sir 🙏
– Team #Kalki2898AD pic.twitter.com/pU7sFWheGy
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




