AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: స్విస్ లగ్జరీ బ్రాండ్ MB&F వాచ్ ధరించిన ఎన్టీఆర్.. ఆ వాచ్ ధర ఎంత ఉంటుందో తెలుసా ?..

ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ తార జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం తారక్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.100 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నాడని తెలుస్తోంది. తారక్ కు కార్లంటే అమితమైన ప్రేమ. అలాగే ఖరీదైన లగ్జరీ వాచ్ కలెక్షన్ ఉంది. నిత్యం తారక్ లైఫ్ స్టైల్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. గతంలో అనేకసార్లు తారక్ ధరించిన వాచ్ గురించి అనేక వార్తలు వినిపించాయి.

Jr.NTR: స్విస్ లగ్జరీ బ్రాండ్ MB&F వాచ్ ధరించిన ఎన్టీఆర్.. ఆ వాచ్ ధర ఎంత ఉంటుందో తెలుసా ?..
Jr.ntr
Rajitha Chanti
|

Updated on: Oct 11, 2023 | 9:12 PM

Share

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అత్యంత సంపన్న సెలబ్రిటీలలో ఒకరు. నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న తారక్.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇందులో కొమురం భీమ్ పాత్రలో తారక్ నటనకు భారతీయులే కాకుండా విదేశీయులు సైతం ముగ్దులయ్యారు. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ తార జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం తారక్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.100 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నాడని తెలుస్తోంది. తారక్ కు కార్లంటే అమితమైన ప్రేమ. అలాగే ఖరీదైన లగ్జరీ వాచ్ కలెక్షన్ ఉంది. నిత్యం తారక్ లైఫ్ స్టైల్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. గతంలో అనేకసార్లు తారక్ ధరించిన వాచ్ గురించి అనేక వార్తలు వినిపించాయి. ప్రస్తుతం లేటేస్ట్ న్యూ వాచ్ పీస్ ధర సోషల్ మీడియాలో వైరలవుతుంది.

MAD సినిమా ప్రమోషన్లలో భాగంగా యంగ్ హీరో సంగీత్ శోభన్.. తారక్ ను కలిశారు. వీరిద్దరికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో తారక్ ధరించిన వాచ్ పైనే అందరి దృష్టి పడింది. ఆ వాచ్ స్విస్ లగ్జరీ బ్రాండ్ MB&F కు చెందినది. ఈ గడియారం అత్యద్భుతమైన ధర ట్యాగ్, దృష్టిని ఆకర్షించడం, ఆకర్షణీయంగా ఉండటం వల్ల స్పాట్‌లైట్‌గా ఉంది. ఈ MB&F టైమ్‌పీస్ విలువ రూ. 1.66 కోట్లు అని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం తారక్ దేవరలో కనిపించనున్నారు. ఇందులో జాన్వీ కపూర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. అలాగే ఇందులో సైఫ్ అలీ ఖాన్ కూడా విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకువస్తున్నట్లు ఇటీవలే డైరెక్టర్ కొరటాల శివ అనౌన్స్ చేశారు. ఇందులో తారక్ మరోసారి ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా 5 ఏప్రిల్ 2024న 5 భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.