AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagame Thandhiram trailer: మాఫియా ముఠాతో తలపడుతున్న ధనుష్.. ‘జగమే తంతిరమ్’ ట్రైలర్..

కోలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ధనుష్, యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో.. వై నాట్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా.. ‘డి 40’

Jagame Thandhiram trailer: మాఫియా ముఠాతో తలపడుతున్న ధనుష్.. 'జగమే తంతిరమ్' ట్రైలర్..
Rajeev Rayala
|

Updated on: Jun 02, 2021 | 7:23 AM

Share

కోలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ధనుష్, యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో.. వై నాట్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా.. ‘డి 40’ (ధనుష్) ప్రముఖ నిర్మాత ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమే అయ్యింది. తమిళ్‌లో ‘జగమే తంతిరమ్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో విడుదల కానుంది.  ధనుష్ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఆయన సరసన ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్ గా  నటిస్తుంది. గతేడాది వేసవిలోనే సినిమా మోషన్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలారోజులు అవుతున్నా ఇంతవరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు దర్శకనిర్మాతలు. ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పటికే ఆలస్యం అయిందనే ఉద్దేశంతో, ఓటీటీలో వదలాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను ‘నెట్ ఫ్లిక్స్’ లో రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను  చిత్రయూనిట్. తమిళనాడుకు చెందిన ‘సురులి’ లండన్ వెళ్లి అక్కడి మాఫియా ముఠాతో తలపడటం .. అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులపై ఈ కథ నడవనుందనే విషయం అర్థమవుతుంది. ట్రైలర్ పూర్తిగా . ధనుశ్ పాత్ర స్వరూప స్వభావాలను ఆవిష్కరిస్తూ కట్ చేశారు. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కెయండి.

మరిన్ని ఇక్కడ చదవండి :

క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన బాలీవుడ్ హీరోయిన్.. కెరీర్‏లోని చెదు ఘటనను గుర్తుచేసుకున్న జరీన్ ఖాన్..

Akhanda Movie: ‘అఖండ’ సినిమా నుంచి మరో సర్‏ఫ్రైజ్.. టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?