Janhvi Kapoor: ఐఫాలో మెరిసిన దేవర బ్యూటీ.. జాన్వీ ధరించిన ఈ నెక్లెస్ ధర ఎన్ని కోట్లో తెలుసా?
ఇటీవలే దేవర సినిమాలో నటించిన జాన్వీ కపూర్ కూడా ఐఫా వేడుకల్లో మెరిసింది. శనివారం (సెప్టెంబర్ 28) సాయంత్రం జరిగిన కార్యక్రమానికి ఆమె హాజరైంది. ఈ ఈవెంట్ కోసం జాన్వీ గోల్డెన్ కలర్ స్లీవ్‌లెస్ గౌను ధరించింది. ఇందులో ఆమె చాలా అందంగా కనిపించింది. సింపుల్ మేకప్ కు తోడు లూజ్ హెయిర్ జాన్వీని మరింత అందంగా మార్చేసింది
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (ఐఫా) అవార్డుల ప్రదానోత్సవం అబుదాబి వేదికగా కన్నుల పండువగా జరిగింది. సెప్టెంబర్ 27న మొదలైన ఈ అవార్డుల వేడుక ఆదివారం (సెప్టెంబర్ 29)తో ముగియనుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ సినీ పరిశ్రమల నుంచి ఎందరో నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఇటీవలే దేవర సినిమాలో నటించిన జాన్వీ కపూర్ కూడా ఐఫా వేడుకల్లో మెరిసింది. శనివారం (సెప్టెంబర్ 28) సాయంత్రం జరిగిన కార్యక్రమానికి ఆమె హాజరైంది. ఈ ఈవెంట్ కోసం జాన్వీ గోల్డెన్ కలర్ స్లీవ్‌లెస్ గౌను ధరించింది. ఇందులో ఆమె చాలా అందంగా కనిపించింది. సింపుల్ మేకప్ కు తోడు లూజ్ హెయిర్ జాన్వీని మరింత అందంగా మార్చేసింది. కాగా ఐఫా ఈవెంట్ లో జాన్వీ లుక్స్‌తో పాటు ఆమె ధరించిన నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. మీడియా కథనాల ప్రకారం జాన్వీ కపూర్ ధరించిన నెక్లెస్ విలువ దాదాపు 8 కోట్లని తెలుస్తోంది. జాన్వీ కపూర్‌కి సంబంధించిన ఈ నెక్లెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సింపుల్ గా ఉన్నప్పటికీ ఇన్ని కోట్లా? అని నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.
ఇన్నాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న జాన్వీ ఇప్పుడు దేవరతో తెలుగు ఆడియెన్స్ కు కూడా చేరువైంది. అయితే ఇందులో ఆమె స్క్రీన్ ప్రజెన్స్ చాలా తక్కువగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే దేవర పార్ట్ 2 లో జాన్వీ పాత్ర మరింత కీలకం కానుందని తెలుస్తోంది. కాగా దేవర సినిమా కోసం జాన్వీ కపూర్ రూ.5 కోట్లు తీసుకుందని సమాచారం. దీంతో పాటు రామ్ చరణ్ ఆర్ సీ 16 (వర్కింగ్ టైటిల్ ) సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపికైంది జాన్వీ కపూర్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమలో లాంఛనంగ ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది.
ఐఫా అవార్డుల వేడుకలో జాన్వీ కపూర్..
View this post on Instagram
స్టైలిష్ డ్రెస్ లో తళుక్కుమన్న తంగం..
View this post on Instagram
దేవర సినిమాలో జాన్వీ కపూర్…
View this post on Instagram
ఏటీఎం సెంటర్ లో వింత శబ్ధాలు.. గుండె గుభేల్ .. వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.