Deepika Padukone: ప్రభాస్ స్పిరిట్ నుంచి దీపిక తప్పుకోవడానికి అసలు కారణమిదా! ఇన్నాళ్లకు వెలుగులోకి వచ్చిన నిజం
ప్రభాస్ 'స్పిరిట్' సినిమా నుంచి దీపికా పదుకొణె బయటకు వచ్చిన తర్వాత అనేక రూమర్లు హల్ చల్ చేశాయి. దీపికా పదుకొనే, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు కూడా వచ్చాయి. అయితే దీపిక తప్పుకోవడానికి అసలు కారణం వేరే ఉందట.

సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ సినిమాల విజయంతో ఆయన పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. ఇప్పుడు ప్రభాస్ తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించాల్సి ఉంది . కానీ ఆమె చిత్ర బృందం నుంచి బయటకు వచ్చింది. దీనికి గల కారణాల గురించి ఇప్పటికే చాలా పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ‘స్పిరిట్’ సినిమా కథ దీపికా పదుకొనేకి నచ్చిందన్నది నిజమే. ఇక ఒప్పందంపై సంతకం మాత్రమే చేయాల్సి ఉంది. అయితే ఇంతలోనే అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా నుంచి కూడా దీపికకు ఆఫర్ వచ్చింది. అందులోని కథ, ఆమె పాత్ర దీపికకు బాగా నచ్చాయి. అయితే ఒకేసారి రెండు సినిమాలు చేయడం కష్టమని భావించింది. పైగా రెండు మూవీస్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. కాబట్టి రెండింటిలో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే దీపికా పదుకొనే స్పిరిట్ సినిమాను పక్కన పెట్టి అల్లు అర్జున్ తో సినిమా ఎంచుకుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. దీపిక ప్రభాస్ తో ‘కల్కి 2898 AD’ సినిమా చేసింది. కానీ అల్లు అర్జున్ తో ఆమెకు ఇదే మొదటి అవకాశం. దీపిక నిర్ణయానికి ఇదే ప్రధాన కారణమని కూడా తెలుస్తోంది.
అయితే ఈ విషయం బయటకు రాకముందే సోషల్ మీడియాలో చాలా గాసిప్స్ వ్యాపించాయి. దీపికా పదుకొనే రోజుకు 8 గంటలు మాత్రమే షూటింగ్ చేయాలని షరతు పెట్టిందని, ఆమె కథను లీక్ చేసిందని రూమర్లు పుట్టుకొచ్చాయి. దీపిక బయటకు వచ్చిన తర్వాత ఆమె ప్లేస్ లో తృప్తి దిమ్రి ‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఇక అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో ఓ పాన్ వరల్డ్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా సన్నాహాలు ఎలా జరుగుతున్నాయో చూపించడానికి ఒక వీడియో ను కూడా విడుదల చేశారు. ఇది బన్నీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
దీపిక లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








