AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: ‘నాకు లెక్కలంటే భయం.. కానీ’.. మోడీ పరీక్షా పే చర్చలో దీపిక ఇన్‌స్పిరేషనల్ స్పీచ్

ప్రధాని మోడీ ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'పరీక్షా పే చర్చ' ఎనిమిదో ఎడిషన్‌లో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపిక పదుకొణె కూడా పాల్గొంది. పరీక్షల ఒత్తిడి, నిరాశ, విజయం తదితర అంశాల గురించి తన అనుభవాలను పంచుకుంది. ఈ సందర్భంగా తన బాల్యంలో లెక్కలంటే భయమన్న దీపిక డిప్రెషన్ ను ఎలా అధిగమించిందో అందరితో పంచుకుంది.

Deepika Padukone: ‘నాకు లెక్కలంటే భయం.. కానీ’.. మోడీ పరీక్షా పే చర్చలో దీపిక ఇన్‌స్పిరేషనల్  స్పీచ్
Deepika Padukone, PM Narendra Modi
Basha Shek
|

Updated on: Feb 11, 2025 | 7:12 PM

Share

పరీక్షలు వచ్చినప్పుడు విద్యార్థులు ఎక్కవ ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడిని తగ్గించడానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘పరీక్ష పే చర్చ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవలే ఎనిమిదవ ఎడిషన్ లో ప్రధాన మంత్రి మోడీ మరోసారి విద్యార్థులతో మాట్లాడారు. ఈ మంచి కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. ఈ జాబితాలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ఉంది. దీపికా పదుకొనే బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్లలో ఒకరు. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు గుర్తింపు ఉంది. అయితే కొన్నేళ్ల క్రితం వివిధ కారణాలతో దీపిక డిప్రెషన్ బారిన పడింది. అయితే మనో ధైర్యంతో ఈ సమస్యను అధిగమించిన ఆమె ఆ తర్వాత డిప్రెషన్ పై తన వంతు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు మోడీ ‘పరీక్ష పే చర్చ’లో కూడా ఒక మంచి సందేశాన్ని అందించింది. దీపిక ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ట్రైలర్‌ మాత్రమే పంచుకున్నారు. పూర్తి వీడియోను ఫిబ్రవరి 12న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

‘పరీక్ష పే చర్చ’ భాగంగా దీపిక తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. ‘చిన్నప్పుడు నేను స్కూల్లో నేనూ సోఫాలు, టేబుల్స్‌, కుర్చీలు ఎక్కి అల్లరి చేసేదాన్ని. చదువుకునే రోజుల్లో చాలా ఒత్తిడి ఉంటుంది. ఉదాహరణకు నాకు లెక్కలంటే చాలా భయం. ఇప్పటికీ అందులో నేను చాలా వీక్‌గానే ఉన్నాను. అయితే మీరందరూ ఆ భయాన్ని అధిగమించాలి. ప్రధాని మోదీ రాసిన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ పుస్తకంలో చెప్పినట్లుగా సమస్యను లోలోపల దాచి పెట్టుకోకుండా బయటకు చెప్పాలి. మీ తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబసభ్యులు, టీచర్లతో పంచుకోవాలి. జర్నల్‌ లేదా డైరీ రాయడం అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు వ్యక్తపర్చుకోవడానికి ఇదొక గొప్ప మార్గం’ అని దీపిక చెప్పుకొచ్చింది. ఇదే సందర్భంగా తాను కూడా ఒక దశలో మానసిక కుంగుబాటు సమస్యను ఎదుర్కొన్నట్లు దీపిక గుర్తు చేసుకుంది. ఈ సమస్య నుంచి తాను ఎలా బయటపడిందో రేపు విడుదలయ్య ఫుల్ ఎపిసోడ్‌లో వివరించనుంది దీపిక.

ఇవి కూడా చదవండి

పరీక్షా పే చర్య కార్యక్రమంలో విద్యార్థులతో దీపిక..

బిడ్డ పుట్టినప్పటి నుండి దీపికా పదుకొనే బహిరంగంగా పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు ఆమె ఈ కార్యక్రమంలో భాగమైంది. కాగా విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమైన ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి దీపిక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.