AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dimple Hayathi : వరుస ట్వీట్లు చేస్తోన్న డింపుల్.. నిజాలు త్వరలోనే తెలుస్తాయన్న డీసీపీ

ఈ ముద్దుగుమ్మ ఏకంగా ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టింది. అంతే కాదు అతనితో దుర్భాషలాడిందని తెలుస్తోంది. అంతటితో ఆగలేదు ఆయన కారును కాలుతో తన్నిందంట కూడా.. దాంతో ఈ బ్యూటీ పై పోలీసు కేసు నమోదు చేశారు. డింపుల్‌ హయతి ఐపీఎస్‌ అధికారి రాహుల్‌ హెగ్డే కారుని పార్కింగ్‌ ప్లేస్‌లో ఢీకొట్టింది.

Dimple Hayathi : వరుస ట్వీట్లు చేస్తోన్న డింపుల్.. నిజాలు త్వరలోనే తెలుస్తాయన్న డీసీపీ
Dimple Hayathi Rahul Hegde
Rajeev Rayala
|

Updated on: May 23, 2023 | 12:20 PM

Share

హీరోయిన్ డింపుల్ హయతి పై పోలీస్ కేసు నమోదైన విషయం తెలిసిందే.  ఈ ముద్దుగుమ్మ ఏకంగా ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టింది. అంతే కాదు అతనితో దుర్భాషలాడిందని తెలుస్తోంది. అంతటితో ఆగలేదు ఆయన కారును కాలుతో తన్నిందంట కూడా.. దాంతో ఈ బ్యూటీ పై పోలీసు కేసు నమోదు చేశారు. డింపుల్‌ హయతి ఐపీఎస్‌ అధికారి రాహుల్‌ హెగ్డే కారుని పార్కింగ్‌ ప్లేస్‌లో ఢీకొట్టింది. కిలాడీ.. రామబాణం లాంటి సినిమాల్లో నటి.. కానీ, రియల్‌ లైఫ్‌లో రెచ్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. నటిని కదా సినిమాల్లోలా ఏం చేసినా చెల్లుతుందనుకుంది. ఏకంగా ఐపీఎస్‌ అధికారి కారును తన్నే స్థాయికి చేరింది ఈ టాలీవుడ్‌ నటి అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును ఢీకొట్టడంతో ఆయన డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు సెక్షన్ 341, 279, 353 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. డింపుల్ హయతితో పాటు ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కూడా అదే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. పార్కింగ్ విషయం ఈ ఇద్దరి మధ్య వివాదం చెలరేగిందని తెలుస్తోంది.

అయితే దీని పై డింపుల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. అధికారాన్ని ఉపయోగించి ఏ తప్పును ఆపలేరు అంటూ ట్వీట్ చేసింది దింపుల్. దాంతో పాటు ఓ స్మైలీ ఎమోజీని షేర్ చేసింది డింపుల్. దేని పై రాహుల్ హెగ్డే రియాక్ట్ అయ్యారు.. ఆయన మాట్లాడుతూ.. కార్ అడ్డు పెట్టద్దు అని నేనే చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను అన్నారు. రంజాన్ రోజు కూడా తన కారు అడ్డు పెట్టడంతో అది తీసేదాకా వెయిట్ చేయడంతో సౌత్ జోన్ కి వెళ్లడం ఆలస్యం అయింది. ఆ రోజు కారు అడ్డంగా పెట్టి దిగి డింపుల్ వెళ్లిపోవడంతో మా సిబ్బందే ఆమె కార్ పక్కన పార్క్ చేసారు. ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోకుండా పోలీస్ వెహికల్ కి కాలుతో తన్ని డామేజ్ చేసింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో ఉన్నాయి అందుకే ఫిర్యాదు చేశాను. కేసు దర్యాప్తు లో ఉంది నిజాలు త్వరలోనే తెలుస్తాయి. కేసుని లా అండ్ ఆర్డర్ పోలీసులు చూస్తున్నారు అన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో ట్వీట్ చేసింది డింపుల్. అధికార దుర్వినియోగం.. తప్పులను దాచలేదు అంటూ డింపుల్ మరో ట్వీట్ చేసింది.