AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss : నెలకు రూ.2 లక్షల జీతం.. బిగ్‏బాస్‏కు వెళ్లి తప్పు చేశా.. ఫైర్ బ్రాండ్ సంచలన కామెంట్స్..

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషలలోనూ ఈ షోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సామాన్యులు, సెలబ్రెటీలు సైతం ఈ షోలో పాల్గొనాలని అనుకుంటారు. ఇటీవలే ఈ షో సీజన్ 9 విజయవంతంగా కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టి చివరకు విజేతగా నిలిచి హిస్టరీ క్రియేట్ చేశాడు కళ్యాణ్ పడాల.

Bigg Boss : నెలకు రూ.2 లక్షల జీతం.. బిగ్‏బాస్‏కు వెళ్లి తప్పు చేశా..  ఫైర్ బ్రాండ్ సంచలన కామెంట్స్..
Srija Dammu
Rajitha Chanti
|

Updated on: Feb 10, 2026 | 5:04 PM

Share

బిగ్‌బాస్ సీజన్ 9.. ఇప్పటివరకు హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ కుర్రాడు కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచాడు. ఇక ఈసారి సీజన్ 9లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ప్రేక్షకులకు దగ్గరైంది మాత్రం దమ్ము శ్రీజ. అగ్నిపరీక్షతోనే అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీజ.. హౌస్ లోకి వెళ్లిన తర్వాత అందరికీ గట్టిపోటీ ఇచ్చింది. టాప్ 5కి వెళ్లాల్సిన ఈ అమ్మడు.. అనుహ్యంగా తక్కువ వారాల్లోనే బయటకు వచ్చేసింది. అడియన్స్ ఓటింగ్ ప్రకారం టాప్ లో ఉన్న శ్రీజను ఊహించని విధంగా బయటకు పంపించడంపై అప్పట్లో నెటిజన్స్ ఎక్కువగానే రియాక్ట్ అయ్యారు. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెట్టింట గట్టిగానే ఫైట్ చేశారు. ఇక ఆ తర్వాత హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పటికీ కుదరలేదు. ఇటీవలే బీబీ జోడికి ఎంట్రీ ఇచ్చిన శ్రీజ.. అక్కడ కూడా నిరాశే ఎదురయ్యింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీజ తన కెరీర్, లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

తనది వైజాగ్ అని తెలిపింది శ్రీజ. తన ఇంటిపేరు దమ్ము అని.. తనకు ఒక అన్న ఉన్నాడని.. తన తండ్రి జీవీఎమ్‌సీ ఎంప్లాయ్ అని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తను ఇల్లు తుడుస్తున్న ఫోటో షేర్ చేసి తనను ట్రోల్ చేశారని.. అప్పుడు తన ఇంట్లో వాళ్లు ఫీలయ్యారని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఎంత సంపాదించావని యాంకర్ అడగ్గా.. కామనర్స్ కాబట్టి ఎక్కువ బడ్జెట్ లేదని.. ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారని తెలిపింది. తనకు నిజంగానే దివ్వెల మాధురి ఎవరో తెలియదని.. తాను పాలిటిక్స్ ఫాలో కానని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు అగ్నిపరీక్షలో ఉన్నప్పుడు తనను చాలా మంది కాంట్రాక్ట్ అయ్యారని.. పీఆర్ చేస్తానని డబ్బులు అడిగారని గుర్తుచేసుకుంది. ఒక్కొక్కరూ ఒక్కోలా అడిగారని.. వారానికి రూ.50 వేలు కూడా అడిగారని.. కానీ తను పీఆర్ పెట్టుకోలేదని చెప్పుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

ఇక తన డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ.. తనపై ఎన్ని కామెంట్స్ చేసిన పట్టించుకోనని.. ఏదైన డ్రెస్ వేసుకుని ఫోటో పెడితే బిగ్ బాస్ తర్వాత ఎక్స్ పోజింగ్ ఎక్కువైందని ట్రోల్ చేస్తుంటారని… కానీ అలాంటి కామెంట్స్ అస్సలు పట్టించుకోనని తెలిపింది. తాను సాఫ్ట్ వేర్ డెవలపర్ అని.. నెలకు రూ.2 లక్షల వరకు జీతం వచ్చేదని తెలిపింది. కానీ బిగ్ బాస్ కోసం తన జాబ్ వదిలేశానని.. ఏడేళ్ల కెరీర్ రిస్క్ చేసి మరీ బిగ్ బాస్ వెళ్లానని.. ఇప్పుడు మళ్లీ జాబ్ ట్రైల్స్ చేస్తున్నానని తెలిపింది శ్రీజ.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

Follow Us