AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ద‌ర్శ‌కుడిగా మారిన క‌మెడియ‌న్ ఆర్‌పీ

జ‌బ‌ర్ధ‌స్థ్, అదిరింది కామెడీ షోల‌తో తెలుగు ప్ర‌జ‌ల‌కి సుప‌రిచిత‌మైన క‌మెడియన్ ఆర్‌పీ ద‌ర్శ‌కునిగా మారారు. జేడీ చక్ర‌వ‌ర్తి ప్ర‌ధాన పాత్ర‌లో ఆయ‌న ఓ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నారు.

ద‌ర్శ‌కుడిగా మారిన క‌మెడియ‌న్ ఆర్‌పీ
Ram Naramaneni
|

Updated on: Aug 23, 2020 | 3:30 PM

Share

‘జ‌బ‌ర్ధ‌స్థ్’, ‘అదిరింది’ కామెడీ షోల‌తో తెలుగు ప్ర‌జ‌ల‌కి సుప‌రిచిత‌మైన క‌మెడియన్ ఆర్‌పీ ద‌ర్శ‌కునిగా మారారు. జేడీ చక్ర‌వ‌ర్తి ప్ర‌ధాన పాత్ర‌లో ఆయ‌న ఓ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నారు. శ్రీ ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై కోవూరు అరుణాచ‌లం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో తాజాగా ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా వెండితెర‌, బుల్లితెర రంగాల‌కి చెందిన వివిధ ప్ర‌ముఖులు విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. అదిరింది జ‌డ్జ్, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు వ‌చ్చి టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఆర్‌పీ మాట్లాడుతూ..

గ‌త కొన్నేళ్లుగా జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షో ద్వారా న‌న్ను ఆద‌రించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి ధ‌న్య‌వాదాలు. సస్పెన్స్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంగా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కుద‌ర‌డంతో ద‌ర్శ‌కునిగా ఆడియెన్స్ ముందుకి రావ‌డానికి నిశ్చ‌యించుకున్నాను. నా మీద న‌మ్మ‌కంతో నిర్మాత కోవూరు అరుణాచలం గారు సినిమాని నిర్మించ‌డానికి ముందుకొచ్చారు. ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1 గా, నా డైర‌క్ష‌న్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమాలో జేడీచ‌క్ర‌వ‌ర్తి కీల‌క పాత్ర పోషించ‌‌డానికి అంగీక‌రించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో జే.డి. పాత్ర చాలా విల‌క్ష‌ణంగా ఉంటుంది. జే.డి.చ‌క్ర‌వ‌ర్తితో పాటు, ప్ర‌కాశ్ రాజ్, రావు ర‌మేశ్, జ‌బ‌ర్ధ‌స్థ్ ఆదిత్య త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో హైద‌రాబాద్, నెల్లూర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా తెలిపారు.

Also Read :

వైఎస్‌ఆర్‌ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల

మ‌ర‌ణంలోనూ వీడ‌ని బంధం : భ‌ర్త మ‌ర‌ణ వార్త విని భార్య మృతి

అలెర్ట్ : ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు

భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..