పవర్ స్టార్ సినిమాకు ప్రొడ్యూసర్‏గా మారనున్న టాప్ కమెడియన్.. మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత ఫుల్ జోరుమీదున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ పూర్తిచేసిన పవన్..ఇటీవలే రెండు సినిమాలను

  • Rajitha Chanti
  • Publish Date - 1:32 pm, Tue, 23 February 21
పవర్ స్టార్ సినిమాకు ప్రొడ్యూసర్‏గా మారనున్న టాప్ కమెడియన్.. మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత ఫుల్ జోరుమీదున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ పూర్తిచేసిన పవన్..ఇటీవలే రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. అటు సాగర్ కె చంద్ర శేఖర్ డైరెక్షన్లో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ చేస్తున్నాడు పవన్. అంతేకాకుండా క్రిష్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్.. గోపాల గోపాల ఫేం కిషోర్ కుమార్ పార్ధనాసి (డాలి) సినిమాలో చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకు టాప్ కమెడియన్ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లుగా సమాచారం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడీయన్ అలీ మధ్య ఉన్న స్నేహబంధం గురించి తెలిసిందే. గత కొన్నిరోజులుగా వీరిద్ధరి మధ్య మనస్పర్థలు రావడంతో.. ఇద్దరు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఓ వేడుకలో ఇద్దరు కలిసి ఫోటోలు దిగారు. దీంతో అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఎప్పటినుంచో కేవలం హాస్యనటుడిగా చేస్తున్న అలీ ఇటీవలే నిర్మాతగాను మారిన సంగతి తెలిసిందే. అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి పలు సినిమాలు చేస్తున్నాడు. తాజాగా పవన్ హీరోగా అలీ ఓ సినిమా నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వం వహించబోతున్నట్లుగా సమాచారం. మరీ ఈ ప్రాజెక్ట్ నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read:

Actress Rakul Preet Singh: రకుల్ సినిమా షూటింగ్ పై రాళ్లదాడికి దిగిన స్థానికులు.. కారణమెంటో తెలుసా..