Oscar 2023: ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌.. అవార్డును కొన్నారంటూ బాలీవుడ్‌ సెలబ్రిటీల అక్కసు.. ఏకిపారేస్తోన్న నెటిజన్స్‌

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ రావడంతో మన భారతీయ సినిమా ఖ్యాతి మరోసారి విశ్వవ్యాప్తమైంది. అలాగే డాక్యుమెంటరీ విభాగంలో ది ఎలిఫెంట్‌ విస్పరర్‌ ఆస్కార్‌ గెల్చుకుంది.

Oscar 2023: ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌.. అవార్డును కొన్నారంటూ బాలీవుడ్‌ సెలబ్రిటీల అక్కసు.. ఏకిపారేస్తోన్న నెటిజన్స్‌
Oscar Awards 2023
Follow us
Basha Shek

|

Updated on: Mar 15, 2023 | 7:39 PM

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ రావడంతో మన భారతీయ సినిమా ఖ్యాతి మరోసారి విశ్వవ్యాప్తమైంది. అలాగే డాక్యుమెంటరీ విభాగంలో ది ఎలిఫెంట్‌ విస్పరర్‌ ఆస్కార్‌ గెల్చుకుంది. ఈక్రమంలో చాలాకాలం తర్వాత భారత్‌కు రెండు ఆస్కార్‌ అవార్డులు రావడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్‌ఆర్ఆర్‌ సినిమాకు ప్రతిష్ఠాత్మక అవార్డు రావడంతో అందరూ మన సినిమా, మన పాట అంటూ పొంగిపోతున్నారు. ఇదే సమయంలో తెలుగు సినిమాకు వస్తోన్న పాపులారిటీని చూసి కొంతమంది కుళ్లుకుంటున్నారు. ఏదో ఒక రకంగా తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్రెండ్ అయిన షాన్ మట్టతిన్ ‘హా..హా..హా.. ఇది చాలా ఫన్నీ. ఇప్పటివరకు భారతదేశంలో మాత్రమే అవార్డ్స్ కొనుక్కోవచ్చని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆస్కార్స్ లో కూడా అలానే. డబ్బులుంటే ఆస్కార్ కూడా కొనేయొచ్చు Lol’ అని కామెంట్ చేశాడు. దీంతో అభిమానులు, నెటిజన్లు షాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు నువ్వు నటన నేర్చుకో అంటూ హితవు చెబుతున్నారు.

మరో వైపు నటి అనన్య ఛటర్జీ సైతం ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్‌ అవార్డు రావడంపై ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ‘నాటు నాటు’ పాటను చూసి ఎందుకు గర్వపడాలి? నాకు అర్థం కావడం లేదు. ఈ పాట గురించి నిజంగా గర్వించాలా? మనం ఎక్కడికి వెళ్తున్నాం’ అంటూ నెగెటివ్‌ కామెంట్లు చేసింది. మొత్తానికి తెలుగు సినిమాకు వస్తోన్న క్రేజ్‌ను చూసి కొందరు బాలీవుడ్ ప్రముఖులు ఓర్వలేకపోతున్నారని వీరి వ్యాఖ్యలతో అర్థమవుతోంది. మరోవైపు ఆస్కార్‌ ప్రకటించాక నాటు నాటు పాటను 10 రెట్లు అధికంగా వెతికినట్లు జపాన్‌కు చెందిన ఓ సంస్థ తన నివేదికలో పేర్కొంది. 1,105 శాతం సెర్చ్‌తో ఆర్‌ఆర్ఆర్‌ పాట రికార్డు సృష్టించిందని తెలిపింది. ఇక టిక్‌ టాక్‌లో ఏకంగా 52.6 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..