విజయ్ సేతుపతి-నయనతార – సమంత క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోలేదట.. అసలు విషయం ఏంటంటే
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నయనతార, సమంత కలిసి ఓ సినిమా చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆమధ్య రకరకాల వార్తలు తెగ వినిపించాయి.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నయనతార, సమంత కలిసి ఓ సినిమా చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆమధ్య రకరకాల వార్తలు తెగ వినిపించాయి. నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ‘‘కాతువాకుల రెండు కాదల్’’ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
లాక్ డౌన్‌కు ముందే లాంఛ్ అయిన ఈ చిత్రం కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇటీవల తమిళ మీడియాలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమాను పక్కకు పెట్టేశాడని గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్ డేట్ బయటకు వచ్చింది. హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో షూటింగ్ కొనసాగించనున్నారట మేకర్స్.ఈ క్రేజీ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ సమాచారం అందుతోంది. ముగ్గురు క్రేజీ స్టార్స్ నటిస్తుండటంతో సినిమాపైనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక సమంత ప్రస్తుతం ఆహా టాక్ షో..సామ్ జామ్ షూట్‌తో బిజీగా ఉంది. మళ్లీ చాలా రోజుల తర్వాత సినిమా కోసం మేకప్ వేసుకుంటుంది సామ్. డిసెంబర్ 14న సమంత షూటింగ్‌లో జాయిన్ కానున్నట్టు టాక్.
మరిన్ని ఇక్కడ చదవండి :