Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Nidimoru and Krishna D.K: రాజ్ అండ్ డీకే… చిత్తూరు జిల్లా కుర్రాళ్లు.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కాక‌రేపుతున్నారు

సినిమా ఇండస్ట్రీలో హలో బ్రదర్ లాంటి అరుదైన జంటలు కొన్నుంటాయి. రాజ్ నిడుమోరు అండ్ కృష్ణ డీకే.. వీళ్ళిద్దరూ ఆ టైపే. సినిమా అనేది వీళ్లకు ఆరో ప్రాణం.

Raj Nidimoru and Krishna D.K: రాజ్ అండ్ డీకే... చిత్తూరు జిల్లా కుర్రాళ్లు.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కాక‌రేపుతున్నారు
Raj And Dk
Follow us
Ram Naramaneni

|

Updated on: May 19, 2021 | 2:42 PM

సినిమా ఇండస్ట్రీలో హలో బ్రదర్ లాంటి అరుదైన జంటలు కొన్నుంటాయి. రాజ్ నిడుమోరు అండ్ కృష్ణ డీకే.. వీళ్ళిద్దరూ ఆ టైపే. సినిమా అనేది వీళ్లకు ఆరో ప్రాణం. చిత్తూరు జిల్లాలో పుట్టిన అచ్చతెలుగు వాళ్ళే అయినా.. వాళ్ళ సినిమా జర్నీ మాత్రం ఔటాఫ్ తెలుగు అన్నట్టే ఉంటుంది. కట్ చేస్తే.. ఇప్పుడు అందరిలాగే ఆ డైరెక్టర్స్ కూడా తెలుగు స్టార్ డమ్ మీదే మనసు పడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం తెలుగులో హాట్ కేక్స్ లాంటి ఈ ఇద్దరు హీరోలే మాకూ కావాలి.. అనేది రాజ్ అండ్ డీకే డిమాండ్. ఇద్దరికీ మంచి కథలు చెప్పి ఫిదా చేశాం.. ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమా మొదలుపెడతాం అనేది వీళ్ళ కాన్ఫిడెన్స్. కానీ.. ఆ ఇద్దరు హీరోలూ ఖాళీగా లేరు.. ఇప్పట్లో ఖాళీ అవుతారన్న గ్యారంటీ కూడా లేదు.

ఇప్పుడు చేస్తున్న సర్కారువారి పాట, రీసెంట్ గా అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ మూవీ, మాటిచ్చిపెట్టిన జక్కన్న సినిమా.. మహేష్ లైనప్ లో ఇవన్నీ అయ్యేసరికి మరో మూడేళ్లు పట్టడం గ్యారంటీ. లైగర్ తో బిజీగా వున్న విజయ్ దేవరకొండ కూడా సుకుమార్ తో మూవీ కమిటయ్యారు. సో.. రాజ్ అండ్ డీకే కోరుకుంటున్న ఆ ఇద్దరూ దొరకాలంటే లాంగ్ వెయిటింగ్ తప్పదు. సినిమా బండి లాంటి చిన్న సినిమా చేసి.. దాన్ని నెట్ ఫ్లిక్స్ లో మోస్ట్ పాపులర్ గా మార్చిన రాజ్ అండ్ డీకే.. ఇప్పటివరకూ వెబ్ సిరీస్ లతో మాత్రమే బాగా ఫేమస్. అది కూడా నార్త్ సైడ్ మాత్రమే వాళ్ళ హవా. వాళ్ళు చేసిన ఫామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ కోసం వెయిట్ చేస్తోంది డిజిటల్ నెటిజనం. నానీతో కలిసి చేసిన ‘డీ ఫర్ దోపిడీ’ తర్వాత.. రెగ్యులర్ మూవీ ఏదీ చెయ్యని హలో బ్రదర్స్ కి మన స్టార్ హీరోలు ఎలా కనెక్ట్ అవుతారు అనేది ఇప్పటికయితే డౌటే!

Also Read: మాస్ మహారాజ రవితేజ ‘ఖిలాడి’ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు .. ఓటీటీకి నో..

సుకుమార్ సినిమాకంటే ముందే మూడు సినిమాలను లైన్ లో పెట్టిన రౌడీ బాయ్

ఈ లక్షణాలు కనిపిస్తే జాతకంలో బుధ స్థానం ఎలా ఉందో తెలుస్తుంది..
ఈ లక్షణాలు కనిపిస్తే జాతకంలో బుధ స్థానం ఎలా ఉందో తెలుస్తుంది..
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వీడియో
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వీడియో
7 అడుగుల గొయ్యి తీసి.. యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు..!
7 అడుగుల గొయ్యి తీసి.. యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు..!
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
మొక్కలు పుష్పించడం లేదా.. బియ్యం బెస్ట్ ఎరువు.. ఎలా యూజ్ చేయాలంటే
మొక్కలు పుష్పించడం లేదా.. బియ్యం బెస్ట్ ఎరువు.. ఎలా యూజ్ చేయాలంటే