Chiranjeevi: మెగాస్టార్ పవర్ ఫుల్ వార్నింగ్.. మీ ఊపిరి ఆగిపోతుంది.. ఖబడ్దార్ అంటూ..
మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాను రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ లో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు మెగాస్టార్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో చేస్తున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాను రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ లో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు మెగాస్టార్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రమోషన్స్ కంటే ముందే ఓ డైలాగ్ ఆడియోను ట్వీట్ చేసి.. తెలుగు టూ స్టేట్స్ లో పొలిటికల్ రచ్చ లేపిన మెగాస్టార్ చిరు.. ఇప్పుడా రచ్చ రేంజ్‌నే మార్చేశారు. అనంతపూర్‌లో జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా… మరో పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి.. అందర్నీ షాక్ చేశారు చిరు. షాక్ చేయడమే కాదు.. ఈ సారి పొలిటికల్ వార్నింగ్ ఇచ్చారనే మాటను మూటగట్టుకుంటున్నారు. మెగాస్టార్ మాట్లాడుతూ..తాను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఈ నేల తడుస్తుందన్నారు. ఈ వేడుక సమయంలో వర్షం రావడం ఆ భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నానని అన్నారు చిరు. రామ్ చరణ్ వల్లే తాను ఈ సినిమా చేశానని.. అతని కోరిపైనే ఈ సినిమా చేశానని తెలిపారు. చిరంజీవి మాట్లాడుతున్నంత సేపు అభిమానులు వర్షంలో తడుస్తూ.. ఈలలు, కేకలతో హోరెత్తించారు. మెగాస్టార్.. మెగాస్టార్ అంటూ నినదాలు చేశారు.
ఇక అంత వర్షంలోనూ.. కదలని అభిమాలను ఉద్దేశ్యించి మెగా స్టార్ ఉద్వేగంగా మాట్లాడారు. తాను ఎప్పుడు వచ్చినా.. రాయసీమలో వర్షం పడుతుందని… ఇదో సెంటిమెంట్ అని చెబుతూనే.. ఓ పవర్ ఫుల్ డైలాగ్ ను జనాలపైకి సంధించారు. మీ అందరి ఊపిరిని కాంట్రాక్ట్ తీసుకున్నా అంటూ.. ఒక్కాసారిగా తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ న అరిపించారు. అయితే చిరు చెప్పిన కాంట్రోవర్సీ డైలాగ్ చివరి లైన్ ఇదే అయినా.. అది బానే ఉన్నా..! దాని ముందు ఉన్న మాటలే ఇప్పుడు పొలికల్ గా హీట్ పెంచేస్తున్నాయి. ‘నీళ్ల కాంట్రాక్ట్, కొండ కాంట్రాక్ట్, మద్యం కాంట్రాక్ట్, నేల కాంట్రాక్ట్ లంటూ .. ఒక్కొక్కరూ ప్రజల సొమ్మును తిని బలిసికొట్టుకుంటున్నారు. ఈ రోజు మీ ఊపిరి.. మీ గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను.. సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం.. తప్పు చేయాలంటే భయం.. తప్ప మీ మనసులో ఏది ఉండకూడదు. ఏదైనా జరగకూడదని జరిగిందో.. మీ ఊపిరి ఆగిపోతుంది.. ఖబడ్దార్’ అని చిరు చెప్పిన డైలాగ్.. చిరు వార్నింగ్ అంటూ.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్ .
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..