Chiranjeevi: చిరంజీవి అందుకే కీర్తిసురేష్ గొంతు పట్టున్నారట.. అసలు విషయం చెప్పిన మెగాస్టార్

వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్స్ తో అదరగొట్టారు. ఇక ఇప్పుడు భోళాశంకర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళనాట సూపర్ హిట్ గా నిలిచిన వేదలమ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెలుగులో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చిరుకి జోడీగా తమన్నా నటిస్తుంది. అలాగే కీర్తిసురేష్ మెగాస్టార్ సిస్టర్ గా నటిస్తుంది. ఈ మూవీలో టాక్సీ డ్రైవర్ గా నటిస్తున్నారు చిరు.

Chiranjeevi: చిరంజీవి అందుకే కీర్తిసురేష్ గొంతు పట్టున్నారట.. అసలు విషయం చెప్పిన మెగాస్టార్
Bhola Shankar
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 07, 2023 | 11:47 AM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న నయా మూవీ భోళాశంకర్. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్నారు చిరంజీవి. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్స్ తో అదరగొట్టారు. ఇక ఇప్పుడు భోళాశంకర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళనాట సూపర్ హిట్ గా నిలిచిన వేదలమ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెలుగులో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చిరుకి జోడీగా తమన్నా నటిస్తుంది. అలాగే కీర్తిసురేష్ మెగాస్టార్ సిస్టర్ గా నటిస్తుంది. ఈ మూవీలో టాక్సీ డ్రైవర్ గా నటిస్తున్నారు చిరు. ఈ సినిమా పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ , టీజర్, సాంగ్స్  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే మొన్నీమధ్య విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.

ఆగస్టు 11న భోళాశంకర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇదిలా ఉంటే చిరంజీవి భోళాశంకర్ ఓ సాంగ్ కు సంబంధించిన చిరు లీక్స్ అంటూ ఆ మధ్య ఓ సాంగ్ షూట్ ను లీక్ చేశారు. ఆ వీడియోలో చిరంజీవి కీర్తిసురేష్ గొంతు పట్టుకొని ఆటపట్టించడం చూడొచ్చు. అయితే మెగాస్టార్ సరదాగా కీర్తిని ఆటపట్టించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అలా ఎందుకో చేశారో చెప్పారు చిరంజీవి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.. కీర్తి సురేష్ కు  ఫుడ్ అంతగా నచ్చలేదట. ఆ విషయం చెప్పడానికి మొహమాట పడిందట. అయితే అప్పుడు చిరంజీవి మా ఇంట్లో తమిళ్ కుక్ ఉన్నాడు నీకు ఏది కావాలన్నా మా ఇంటి నుంచి తెప్పిస్తాను అని చెప్పారట. అయితే ఆమె రోజు ఏమాత్రం మొహమాట పడకుండా ఏ రోజు ఏం ఫుడ్ తీసుకువస్తారు. రేపు ఏం తీసుకువస్తారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. దాంతో ఫన్నీగా చంపేస్తా అంటూ అలా సరదాగా గొంతు పట్టుకున్నా.. అని తెలిపారు మెగాస్టార్. అంతే కాదు ఫుడ్ లో ఏది తక్కువైనా ఇట్టే అడిగేస్తుంది.. ఏమాత్రం మొహమాట పడదు.. మా ఇంటి సభ్యులుగా కలిసిపోయింది అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..