Mahesh Babu: మహేష్ మూవీలోని అమ్మడి గుర్తుందా..? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
సూపర్ స్టార్ మహేష్ లాస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో మహేష్ బాబు తన నటనతో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తిసురేష్ ఫ్రెండ్ గా నటించిన ఈ అమ్మాయి గురించి మీకు తెలుసా..? ఈ చిన్నదాని పేరు […]

సూపర్ స్టార్ మహేష్ లాస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో మహేష్ బాబు తన నటనతో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తిసురేష్ ఫ్రెండ్ గా నటించిన ఈ అమ్మాయి గురించి మీకు తెలుసా..? ఈ చిన్నదాని పేరు సౌమ్య మీనన్. మోడలింగ్ నుంచి నటిగా మారింది ఈ బ్యూటీ. మహేష్ బాబు తో ఎలాగైనా నటించాలన్న ఆశతో సర్కారు వారిపాట సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ మూవీలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది. పాత్ర చిన్నదే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతంలో మలయాళం ఇండస్ట్రీలో కినవల్లి, ఫ్యాన్సీ డ్రెస్, చిల్డ్రన్స్ పార్క్.. లాంటి సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్‌గా చేసింది సౌమ్య. ఇప్పుడు తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది. త్వరలోనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది
ఇటీవలే సౌమ్య మీనన్ పుట్టిన రోజు జరిగింది. ఈ సందర్భంగా ఆమె తన కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. సర అనే సినిమాలో నటిస్తుంది సౌమ్య. ఈ మూవీ లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతోంది. వి.శశిభూషణ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సౌమ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుంది. విభిన్నమైన కథాంశం ఉన్న కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో సౌమ్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈ చిన్నది నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాలషోతో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. గతంలో టాక్సీ అనే సినిమాలో చేసింది సౌమ్య మీనన్. అయితే ఈ మూవీ కంటే ముందు సర్కారు వారి పాట సినిమా రిలీజ్ కాడడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ిన సౌమ్య కేవలం నటి మాత్రమే కాదు. మంచి డ్యాన్సర్ కూడా.. ఆమె మలయాళంలో కొన్ని సాంగ్స్ కూడా చేసింది. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించి ఆకట్టుకుంది ఈ భామ. ఇక ఇప్పుడు ఈ చిన్నది సర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు అమ్మడికి విషెస్ తెలుపుతున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని క్రేజీ అప్డేట్స్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




