AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మరోసారి తెరపైకి టికెట్ ప్రైస్.. మేకర్స్ మళ్లీ పాత పద్దతిలోకి వెళ్తున్నారా..?

టికెట్ ప్రైస్ గురించి మరోసారి చర్చ మొదలైంది. భోళా శంకర్‌కు నో హైక్ అంటున్నారు మేకర్స్. అంటే మళ్లీ పాత పద్దతిలోకి వెళ్తున్నారా..? ఇకపై రేట్లు  పెంచడాలుండవా..? ట్రిపుల్ ఆర్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో టికెట్ రేట్లు పెంచుకునే ట్రెండ్ మొదలైంది. అప్పటి వరకు ఎంత బడ్జెట్‌తో తీసినా.. ఎలాంటి పరిస్థితులున్నా ఉన్న టికెట్ రేట్లకు సినిమా చూపించాల్సిందే.

Tollywood: మరోసారి తెరపైకి టికెట్ ప్రైస్.. మేకర్స్ మళ్లీ పాత పద్దతిలోకి వెళ్తున్నారా..?
Movies
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 07, 2023 | 10:49 AM

Share

హీరోలు మారిపోతున్నారా లేదంటే నిర్మాతలు వద్దనుకుంటున్నారా.. అదీ కాదంటే ఆడియన్స్ ఇచ్చిన షాక్‌తో వెనకడుగు వేస్తున్నారా..? అసలు దేని గురించి ఈ టాపిక్ అనుకుంటున్నారు కదా.. టికెట్ ప్రైస్ గురించి మరోసారి చర్చ మొదలైంది. భోళా శంకర్‌కు నో హైక్ అంటున్నారు మేకర్స్. అంటే మళ్లీ పాత పద్దతిలోకి వెళ్తున్నారా..? ఇకపై రేట్లు  పెంచడాలుండవా..? ట్రిపుల్ ఆర్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో టికెట్ రేట్లు పెంచుకునే ట్రెండ్ మొదలైంది. అప్పటి వరకు ఎంత బడ్జెట్‌తో తీసినా.. ఎలాంటి పరిస్థితులున్నా ఉన్న టికెట్ రేట్లకు సినిమా చూపించాల్సిందే. కానీ బడ్జెట్ బాధలు ప్రభుత్వం దగ్గర విన్నవించుకోవడంతో.. నిర్మాతలకు వరం ఇచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అయితే ఇది కొన్ని సినిమాలకు వర్కవుట్ అయినా.. మరికొన్నింటికి భస్మాసుర అస్త్రం అయింది.

టికెట్ రేట్లు పెంచిన తర్వాత స్టార్ హీరోల సినిమాలు సైతం మార్నింగ్ షోస్ ఫుల్ కాలేదు. ఒకప్పుడు మార్నింగ్ షో టికెట్ కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది.. కానీ ఇప్పుడు రేట్ల తాకిడికి కౌంటర్‌లో వాళ్లే పిలిచి మరీ ఇస్తున్నారు. అంటే స్టార్ హీరోల క్రేజ్ తగ్గిందా లేదంటే పెరిగిన టికెట్ రేట్లతో కామన్ ఆడియన్ సినిమాలకు దూరం అవుతున్నాడా..? ఆల్రెడీ 295 ఉన్న టికెట్.. పెరిగాక 350 అవుతుంది తెలంగాణలో.. ఏపీలో అయితే 220 రూపాయల పైమాటే.

టికెట్ రేట్లు పెరిగాక భారీ కలెక్షన్స్ రావడం మాట దేవుడెరుగు.. కనీసం మొదటి రోజు థియేటర్లకు జనం రావడానికి భయపడుతున్నారనే విమర్శలు వచ్చాయి. పెరిగిన టికెట్ రేట్లు సినిమాకు హెల్ప్ అవుతున్నాయా లేదంటే కిల్ చేస్తున్నాయా అనేది అర్థం కాలేదు. అందుకే మన నిర్మాతలు కూడా రియలైజ్ అయి రియాలిటీలోకి వచ్చేస్తున్నారు.. పెద్ద సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచట్లేదు ఈ మధ్య.

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, దసరా వరకు కూడా టికెట్ రేట్లు పెంచిన నిర్మాతలు.. బ్రో నుంచి మారిపోయారు. అదంటే పొలిటికల్ ప్రెజర్స్‌తో పెంచలేదనుకోవచ్చు కానీ.. ఇప్పుడు భోళా శంకర్, జైలర్ కూడా నార్మల్ టికెట్ రేట్లతోనే వస్తున్నాయి. ఇకపై ఇదే ట్రెండ్ సాగితే.. ఇండస్ట్రీ పాత రోజుల్లోకి వచ్చినట్లే. మామూలు రేట్ అయినా నైజాంలో మల్టీప్లెక్స్ 295 రూపాయలు.. సింగిల్ స్క్రీన్ 175 రూపాయలు ఉంది. అదే ఎక్కువని ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!