Tollywood: 20 ఏళ్ల నాటి ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్.. ఎంతలా మారిపోయాడు! గుర్తు పట్టారా?

ఇటీవల గోవా వేదికగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాల స్పెషల్ స్క్రీనింగ్ కూడా జరిగింది. ఇటీవల బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు రాబట్టిన ఓ తెలుగు సినిమాను కూడా ఈ ఈవెంట్ లో ప్రదర్శించారు. అంతేకాదు ఈ మూవీ డైరెక్టర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

Tollywood: 20 ఏళ్ల నాటి ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్.. ఎంతలా మారిపోయాడు! గుర్తు పట్టారా?
Tollywood Director
Follow us
Basha Shek

|

Updated on: Nov 29, 2024 | 3:32 PM

పై ఫొటోలో చింపిరి జుట్టుతో, బక్క పల్చని దేహంతో ఉన్నదెవరినో గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్. అలాగనీ అతను ఎక్కువగా సినిమాలేమీ చేయలేదు. ముచ్చటగా మూడు సినిమాలు తీశాడు అంతే. కానీ అన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే. ముఖ్యంగా ఈ ఏడాది ఈ టాలీవుడ్ డైరెక్టర్ పేరు బాగా మార్మోగిపోయింది. ఏకంగా 1000 కోట్ల సినిమాను తీసి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. హాలీవుడ్ సినిమాను తలదన్నేలా తన టేకింగ్ తో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేశాడు. అయితే ఈ స్టార్ డైరెక్టర్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. ఈవెంట్ ఆర్గనైజర్ గా కూడా పనిచేశాడు. మెల్లి మెల్లిగా ఒక్కో మెట్టూ ఎదుగుతూ మెగా ఫొన్ పట్టుకున్నాడు. ఇప్పుడు దేశం గర్వించ దగ్గ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోయాడు. మరి పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా? అతను మరెవరో కాదు ప్రభాస్ తో కల్కి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తీసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇది అతని 20 ఏళ్ల నాటి ఫొటో. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నాగ్ అశ్విన్ ఈ ఫొటోను అందులో షేర్ చేసి ఒక ఆసక్తి కర విషయాన్ని పంచుకున్నాడు.

ఇటీవల ముగిసిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన నాగ్‌ అశ్విన్‌ 20 ఏళ్ల క్రితం అదే ఈవెంట్‌లో ఒక ఆర్గనైజర్‌గా వర్క్‌ చేశాడట. 2004లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మొదటి ఈ వెంట్ గోవాలో నిర్వహించినప్పుడు విమానాశ్రయంలో సినీ సెలబ్రెటీలకు మార్గ నిర్దేశం చేయడం, గోవాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న థియేటర్‌లలో స్క్రీనింగ్‌కు ఫిల్మ్‌ మేకర్స్‌కి సహాయం చేయడం వంటి పనులు చేశాడట. అలా ఆ ఈవెంట్‌ నిర్వహణలో నాగ్‌ అశ్విన్‌ కీలక పాత్ర పోషించారట.

ఇవి కూడా చదవండి

కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫ్యామిలీ ఫొటో..

View this post on Instagram

A post shared by nagi (@nag_ashwin)

అలా ఒక ఈవెంట్ ఆర్గనైజర్ గా వర్క్ చేసిన నాగ్ అశ్విన్ ఇప్పడు అదే ఈవెంట్ లో ముఖ్య అతిథుల్లో ఒకరిగా నిలిచారు. తన కల్కి సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కూడా అయ్యింది. దీంతో ఈ స్టార్ డైరెక్టర్‌పై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

View this post on Instagram

A post shared by nagi (@nag_ashwin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..