Mahesh Babu: మహేష్ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన మెగా హీరో.. ఎలా మిస్సైయ్యారంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దివంగత హీరో కృష్ణ నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన మహేష్.. ఆ తర్వాత నటుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు.

Mahesh Babu: మహేష్ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన మెగా హీరో.. ఎలా మిస్సైయ్యారంటే..
Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 29, 2024 | 3:56 PM

సాధారణంగా సినీరంగంలో ఓ స్టార్ హీరో కోసం రాసుకున్న స్టోరీతో మరో హీరో హిట్ అందుకుంటాడు. మరికొన్నిసార్లు ఓ హీరో ఖాతాలో పడాల్సిన డిజాస్టర్ మరో నటుడి ఖాతాలో చేరిపోతుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సిన ఓ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు మెగా హీరో. ఇంతకీ ఎవరు ఆ మెగా హీరో.. ? ఏ సినిమా ? అనేది తెలుసుకుందామా. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబుకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో గుంటూరు కారం సినిమాతో హిట్టు కొట్టిన మహేష్.. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోయే తన కొత్త ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోయే మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్, మహేష్ లుక్ టెస్ట్ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు ఖాతాలో పడాల్సిన ఓ హిట్ మూవీ మెగా హీరో వద్దకు చేరింది. ఆ సినిమా ఏదంటే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా వరుణ్, సాయి పల్లవికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మొదట మహేష్ బాబును హీరోగా అనుకున్నారట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గోదావరి, ఆనంద్ సినిమాల తర్వాత ఫిదా సినిమాను సైతం ఎంతో నమ్మకంగా రాసుకున్నానని.. ఈ మూవీ స్టోరీని మహేష్ బాబుకు వినిపించానని.. ఆయనకు స్టోరీ చాలా నచ్చిందని…కొన్ని మార్పులు చేయాలని చెప్పారట. అన్ని ఓకే అనుకనే సమయానికి మహేష్ కు డేట్స్ కుదరలేదని.. అందుకే ఫిదా సినిమాలో చేయలేకపోయారట.

ఇక ఇందులో మహేష్ సరసన దీపిక పదుకొణెను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ అనుకోకుండా ఈ చిత్రాన్ని వరుణ్ తేజ్, సాయి పల్లవిలతో తెరకెక్కించారు. ఈ మూవీ విడుదలయ్యాక.. ఈ కథకు వీళ్లిద్దరూ పర్ ఫెక్ట్ గా సరిపోయారంటూ అడియన్స్ ప్రశంసలు కురిపించారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.