Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 18 ఏళ్ల వయసులోనే వేధింపులు.. ఓ స్టార్ హీరో ఒంటరిగా రమ్మన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

సాధారణంగా స్త్రీలకు ఏ రంగంలో అయిన కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉంటాయి. కానీ సినీరంగంలో ఇలాంటి అనుభవాల గురించి చాలా మంది హీరోయిన్స్ బహిరంగంగా మాట్లాడారు. అప్పట్లో మీటూ ఉద్యమం పేరుతో అనేక మంది హీరోయిన్స్ తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం దాదాపు 29 ఏళ్ల తర్వాత ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.

Tollywood: 18 ఏళ్ల వయసులోనే వేధింపులు.. ఓ స్టార్ హీరో ఒంటరిగా రమ్మన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
Isha Koppikar
Rajitha Chanti
|

Updated on: Nov 29, 2024 | 2:46 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. తొలి చిత్రంతోనే టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్స్.. ఆ తర్వాత కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా..? తనే ఇషా కొప్పికర్. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను ఓ స్టార్ హీరో ఒంటరిగా రమ్మనాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దాదాపు 29 ఏళ్ల తర్వాత ఆ విషయాన్ని బయటపెట్టింది. ఇషా కొప్పికర్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అక్కినేని నాగార్జున నటించిచన చంద్రలేఖ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యింది.

ఇండస్ట్రీలో నువ్వేం చేయగలవు అనేది ఎవరు చూడరని.. హీరోయిన్స్ ఏమి చేయాలనేది హీరోలు మాత్రమే డిసైడ్ చేస్తారని తెలిపింది ఇషా కొప్పికర్. విలువలను నమ్ముతూ సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే ఎంతో కష్టమని.. క్యాస్టింగ్ కౌచ్ భయంతో ఇండస్ట్రీకి దూరమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారని.. అలాగే కఠిన పరిస్థితులను ఎదుర్కొని నిలబడిన హీరోయిన్స్ కూడా ఉన్నారని తెలిపింది. 18 ఏళ్ల వయసులోనే తన దగ్గరకు ఓ నటుడు వచ్చి తనతో స్నేహంగా ఉంటేనే అవకాశాలు వస్తాయని చెప్పారని చెప్పుకొచ్చింది.

సినీరంగంలో చాలా మంది అనుచితంగా తాకేవారని.. అప్పట్లో ఓ స్టార్ హీరో సైతం తనను ఒంటరిగా రావాలని చెప్పాడని.. డ్రైవర్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకుండా తనను కలవడానికి రావాలని చెప్పాడని.. కొన్ని సందర్భాల్లో హీరోలతో కచ్చితంగా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది ఇషా కొప్పికర్.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.