Chaavu Kaburu Challaga Pre Release Event LIVE: వైభవంగా ‘చావు కబురు చల్లగా’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా బన్నీ
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఇప్పడు మంచి జోరు చూపిస్తున్నారు. మంచి, మంచి క్రేజీ ప్రాజెక్ట్‌లు సెలక్ట్ చేసుకుంటూ తన అభిరుచి చాటుకుంటున్నారు.

Chaavu Kaburu Challaga : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఇప్పడు మంచి జోరు చూపిస్తున్నారు. మంచి, మంచి క్రేజీ ప్రాజెక్ట్‌లు సెలక్ట్ చేసుకుంటూ తన అభిరుచి చాటుకుంటున్నారు. మనోడుకు ఇప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా తోడైంది. తొలి సినిమా ఆర్ఎక్స్ 100తో యువతలో ప్రత్యేక గుర్తింపు పొందిన కార్తికేయ తాజాగా ‘చావు కబురు చల్లగా’ సినిమా చేశాడు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి అతడితో కలిసి ఆడిపాడింది. యాక్షన్ రొమాంటిక్ కథగా తెరకెక్కతున్న ఈ సినిమాను కౌషిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్ని వాసు నిర్మించారు.
ఈ సినిమాలో మరో స్పెషాలిటీ ఏంటంటే ప్రముఖ యాంకర్, నటి అనసూయ కీలక పాత్రలో కనిపిచంనున్నారు. ఓ ప్రత్యేక గీతంలో కూడా ఆమె నటించారు. ఈ సినిమా ట్రైలర్ సహా పాటల ప్రోమోలు కూడా మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి బండి నడిపే డ్రైవర్ పాత్రలో నటించారు. భర్తను కోల్పోయిన మహిళను లవ్ చేసే వ్యక్తిగా అతడు యాక్టింగ్ ఇరగదీశాడని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. ఈ చిత్రం ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం( మార్చి 9న) నిర్వస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేయనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ టీవీ9లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ దిగువన వీక్షించండి:
Also Read:
దేత్తడి హారికకు భారీ షాక్.. టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె నియామక వివరాలు తొలగింపు‘
స్మృతి మంధనా ఊచకోత, గోస్వామి మెరుపు బౌలింగ్.. 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన దక్షిణాఫ్రికా