Chandramukhi 2: ఈ అందాల తార మనసు కూడా అందమైనదే.. ప్రతివారం అనాథలకు అన్నదానం చేస్తోన్న చంద్రముఖి 2 నటి
సుభిక్షా కృష్ణన్.. మన తెలుగు ప్రేక్షకులకు ఈ హీరోయిన్ పెద్దగా తెలియకపోవచ్చు కానీ తమిళ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇది సినిమాలతో మాత్రమే వచ్చిన క్రేజ్ కాదు.. సుభిక్ష చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్‌కు కారణం. ఇటీవల విడుదలైన చంద్ర ముఖి 2 సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన ఈ అందాల తార మనసు కూడా ఎంతో అందమైనదే అంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు
సుభిక్షా కృష్ణన్.. మన తెలుగు ప్రేక్షకులకు ఈ హీరోయిన్ పెద్దగా తెలియకపోవచ్చు కానీ తమిళ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇది సినిమాలతో మాత్రమే వచ్చిన క్రేజ్ కాదు.. సుభిక్ష చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్‌కు కారణం. ఇటీవల విడుదలైన చంద్ర ముఖి 2 సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన ఈ అందాల తార మనసు కూడా ఎంతో అందమైనదే అంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది సుభిక్ష. ఇందులో భాగంగా తన ఇంటి సమీపంలోని అనాథలకు ప్రతివారం అన్నదానం చేస్తోంది. ఇక సినిమా షూటింగ్‌ల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ఇతరత్రా కార్యక్రమాలతో తాను అందుబాటులో లేనప్పుడు తన తల్లితో ఈ అన్నాదాన కార్యక్రమాలు నిర్వహిస్తోందీ ముద్దుగుమ్మ. అంతేకాదు తన పుట్టిన రోజు, కుటుంబ సభ్యుల బర్త్ డే వేడుకలు, పండగల .. ఇలా ప్రత్యేక సందర్భాల్లోనూ అనాథలకు తప్పకుండా అన్నదానాలు చేస్తోంది సుభిక్ష. ఇక మూగజీవాల పట్ల కూడా ఎంతో ప్రేమ చూపిస్తోంది. వీధి కుక్కలతో పాటు ఇతర జంతువులకు పండ్లు, ఆహార పదార్థాలను అంజేస్తోంది. తన సోషల్ మీడియా ఖాతాలను ఒకసారి పరిశీలిస్తే.. తన సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలే కనిపిస్తాయి. దీంతో అందరూ సుభిక్షా కృష్ణన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నటి మనసూ అందమైనదేనంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక సుభిక్ష విషయానికొస్తే.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 2013 భారతీరాజా తెరకెక్కించిన అన్నకోడి సినిమాలో కథానాయికగా అరంగేట్రం చేసింది. అదే ఏడాది ఒలిప్పోరు సినిమాలో ఫహద్ ఫాసిల్ పక్కన హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అంజాదగండ, కంఠారి, ఏటీఎమ్, కడుగు, గోలీసోడా 2, పొద్దు నలన్ కారుది, నేత్ర, వెట్టైనాయి, కన్నాయ్ నంబతే వంటి తమిళ, మలయాళ సినిమాల్లో కథానాయికగా నటించిందీ అందాల తార. తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఇటీవల విడుదలైన లారెన్స్, కంగనా రనౌత్‌ల చంద్రముఖి 2 సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది.
లారెన్స్ తో సుభిక్ష డ్యాన్స్..
View this post on Instagram
చంద్రముఖి 2 నటి సేవా కార్యక్రమాలు..
View this post on Instagram
నెటిజన్ల ప్రశంసల వర్షం..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.