Apple Watch: యాపిల్ వాచ్‌ నా తండ్రి ప్రాణాలను కాపాడింది: సీఈవో

Apple Watch: ఆపిల్ వాచ్ చాలా మంది ప్రాణాలను కాపాడిందని చెబుతూ, టిమ్ కుక్ తన తండ్రికి జరిగిన సంఘటన గురించి పంచుకున్నారు. యాపిల్ వాచ్‌లో మెడికల్ అలర్ట్ ఫీచర్ ఉందని, ఇది ఒకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మా నాన్న ఒంటరిగా ఉంటున్నారు..

Apple Watch: యాపిల్ వాచ్‌ నా తండ్రి ప్రాణాలను కాపాడింది: సీఈవో
Follow us
Subhash Goud

|

Updated on: Jan 16, 2025 | 9:15 PM

ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కంపెనీలలో ఆపిల్ ఒకటి. ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌లు, వాచ్‌లతో సహా అనేక రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయిస్తుంది. యాపిల్ ఉత్పత్తులను కొనడం చాలా మందికి పెద్ద కల. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీకి టిమ్ కుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అతను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన వ్యక్తిగత జీవితం, ఆపిల్ వాచ్ గురించి చాలా ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు.

ఇంటర్వ్యూలో, టిమ్ కుక్ తన రోజువారీ జీవితం, తనకు ఇష్టమైన ఆహారం, అతను తన రోజును ఎలా ప్రారంభిస్తారు.. అతను ఎలాంటి వైన్‌ను ఇష్టపడతాడనే దాని గురించి చాలా విషయాలను పంచుకున్నాడు. తాను సాధారణ కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు. యాపిల్ స్మార్ట్ వాచ్ ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని అన్నారు. చాలా మంది మెయిల్ ద్వారా తమ కథనాలను పంచుకుంటున్నారని, వాటిని చదవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.

యాపిల్ వాచ్ మా నాన్న జీవితాన్ని కాపాడింది:

ఆపిల్ వాచ్ చాలా మంది ప్రాణాలను కాపాడిందని చెబుతూ, టిమ్ కుక్ తన తండ్రికి జరిగిన సంఘటన గురించి పంచుకున్నారు. యాపిల్ వాచ్‌లో మెడికల్ అలర్ట్ ఫీచర్ ఉందని, ఇది ఒకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మా నాన్న ఒంటరిగా ఉంటున్నారు.. ఈ స్థితిలో ఓ రోజు నేల మీద పడ్డాడు. వెంటనే ఆపిల్ వాచ్ నాకు నోటిఫికేషన్ పంపింది. వెంటనే సమాచారం అందుకున్న ఇంటికి వెళ్లానని, వారు తండ్రి తలుపులు తీయకపోవడంతో తలుపులు పగులగొట్టి తండ్రి ప్రాణాలు కాపాడుకున్నానని చెప్పుకొచ్చారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి