Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దా*డి.. 6 చోట్ల క*త్తిపోట్లు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి నటుడి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. బాంద్రాలోని సైఫ్ ఇంట్లో ఈ దారుణానికి పాల్పడ్డాడు దుండగుడు. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాడిలో సైఫ్‌కి ఆరుచోట్ల కత్తిపోట్లు పొడిచారు. రెండు మూడు చోట్ల తీవ్ర గాయాలైనట్టు వైద్యులు తెలిపారు.
వెన్నెముక సమీపంలో తీవ్రగాయం కావడంతో ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు సైఫ్ అలీఖాన్. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతడిని గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీపుటేజీని పరిశీలిస్తున్నారు ముంబయి పోలీసులు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. సైఫ్ ఇంట్లో సిబ్బందిని విచారిస్తున్నారు. వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మరోవైపు సైఫ్ అలీఖాన్‌కు లీలావతి ఆస్పత్రిలో శస్ర్తచికిత్స చేస్తున్నారు వైద్యులు. సర్జరీ తర్వాతే సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌బులిటెన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్
TOP 9 ET News: వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్ | కలెక్షన్స్ కుమ్మడంలో ‘డాకు’ నెం1
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో.. ఇలా!
అవాక్కయ్యేలా చేసిన జానీ మాస్టర్ కొడుకు.. గేమ్ ఛేంజర్ గురించి భలేగా మాట్లాడాడు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. ఏంటా అని వెళ్లి చూడగా!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

