Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హమ్మయ్య..యుద్ధం ఆగింది.. ఇక మోదీ కల నెరవేరినట్టే

హమ్మయ్య..యుద్ధం ఆగింది.. ఇక మోదీ కల నెరవేరినట్టే

Phani CH

|

Updated on: Jan 16, 2025 | 7:50 PM

15 నెలల పాటు విధ్వంసం. బాంబుల మోతలతో దద్దరిల్లిపోయిన ప్రాంతం. శిథిలాలు. ఆకలి చావులు. చిన్నారుల ఏడుపులు. ఇలా చెప్పుకుంటూ పోతే..ఆ బాధకు అంతే లేదు. 2023 అక్టోబర్‌లో మొదలైన యుద్ధం..ఇప్పటి వరకూ కొనసాగుతూ వచ్చింది. వేలాది మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం మిగిల్చిన విషాదమిది.

ఎన్ని సార్లు ఐక్యరాజ్య సమితి హెచ్చరించినా..ఇంకెన్నిసార్లు అంతర్జాతీయ సమాజం వార్నింగ్ ఇచ్చినా యుద్ధం ఆగలేదు. అంతకంతకూ తీవ్రమవుతూ వచ్చింది. ఎప్పుడైతే హమాస్..ఇజ్రాయేల్‌పై దాడి చేసిందో అప్పటి నుంచి ఈ గొడవ ముదిరింది. ఆ దాడిలో దాదాపు 12 వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా గాజా ప్రాంతం అల్లకల్లోలమైంది. వరుస పెట్టి హమాస్‌ నుంచి క్షిపణులు దూసుకొచ్చాయి. ఉన్నట్టుండి బాంబుల వర్షం కురిసింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక గాజాలో నివసించే వాళ్లలో దాదాపు 90% మంది అక్కడి నుంచి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పారిపోయారు. తమ పిల్లలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఎక్కడో ఓ చోట కాస్తంత నీడ దొరుకుతుందేమోనని ఆరాటపడ్డారు. ఇంకెన్ని రోజులు మాకీ అవస్థలు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత విధ్వంసంలో కాస్తంత ఊరటనిచ్చే వార్త వచ్చింది. ఇజ్రాయేల్, హమాస్‌ యుద్ధానికి ఫుల్‌స్టాప్ పడనుంది. ఈ రెండు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందన్న విషయం ఊరటనిచ్చింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.100 కోట్లు కొల్లగొట్టిన డాకు.. బాలయ్యే కింగ్ ఆఫ్ సంక్రాంతి..

Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌పై దుండగుడి దా*డి.. 6 చోట్ల క*త్తిపోట్లు

50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌

TOP 9 ET News: వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్ | కలెక్షన్స్‌ కుమ్మడంలో ‘డాకు’ నెం1

గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో.. ఇలా!