ఒంపు సొంపులపై ఫోకస్ చేస్తున్న కుషిత క‌ల్లపు.. పిక్స్ వైరల్

Phani CH

16 January 2025

Credit: Instagram

కుషిత క‌ల్లపు గురించి ప్రస్తుత కుర్రకారుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న సోషల్ మీడియా నటుల్లో ఈమె కూడా ఒకరు.

చీర‌క‌ట్టులో మ‌న ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపించే ఈ ప‌క్కా హైద‌రాబాదీ బ్యూటీ ఎలాంటి డ్రెస్ వేసిన అందులో ఒదిగిపోతుంది.

ఈ ముద్దుగుమ్మ గురించి చెప్పాలంటే అప్ప‌టివ‌ర‌కు మోడ‌ల్‌గా అంతంత మాత్రంగానే పేరున్న‌ కుషిత హైద‌రాబాద్ డ్ర‌గ్స్ కేసు ఈమె పాలిట వరంగా మారిందనే చెప్పాలి.

ముఖ్యంగా ఈ కేసు సమయంలో ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఈ ముద్దుగుమ్మ తెగ వైరల్ అయ్యింది.

ఇక ఇదే ఊపులో గ‌త సంవ‌త్స‌రం ఛాంగురే బంగారు రాజా, నీతేనే నేను సినిమాల్లో న‌టించిన ఈ చిన్న‌ది ఈ సంవ‌త్స‌రం బాబు నెంబ‌ర్‌వ‌న్ బుల్షిట్ గాయ్ చిత్రంలో న‌టించింది. 

అయితే గుంటూరు కారం సినిమాలో నటించినట్టు తెలిపిన కుషిత.. సినిమా రిలీజ్ అయ్యాక అందులో ఈమె కనిపించలేదు. ఆ తరువాత దీనిపై ఈ అమ్మడు క్లారిటీ కూడా ఇచ్చింది.

ప్ర‌స్తుతం చేతిలో సినిమాలు అంతంత‌మాత్రంగానే ఉండ‌డంతో కుషిత  సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా తన క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది ఈ చిన్నది.