AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaavu Kaburu Challaga: థియేటర్స్ లో ఫట్ అయినా ఓటీటీలో హిట్ అయిన సినిమా..

కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకొని టీవీల్లో మాత్రం భారీ టీఆర్పీ లను సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫట్..

Chaavu Kaburu Challaga: థియేటర్స్ లో ఫట్ అయినా ఓటీటీలో హిట్ అయిన సినిమా..
Rajeev Rayala
| Edited By: |

Updated on: Apr 28, 2021 | 8:57 AM

Share

Chaavu Kaburu Challaga:

కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకొని టీవీల్లో మాత్రం భారీ టీఆర్పీ లను సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫట్ అయ్యి టీవీల్లో హిట్ అయ్యాయి ఇప్పుడు ఈ సినిమా కూడా అదే జాబితాలో చేరింది.  యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి కలిసి నటించిన సినిమా చావు కబురు చల్లగా..డైరెక్టర్ కౌశిక్ ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఏప్రిల్ 26 నుంచి స్రీమింగ్ అవుతుంది. శవాలను తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్ (బస్తీ బలరాజు).. మెటర్నటీ నర్స్ (మల్లిక) భర్త శవాన్ని తీసుకురావడానికి వెళ్లి… ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఇక తన అల్లరితో మల్లికను ఇబ్బందులు పెడుతూ ఆమె వెంటపడతాడు. ఇక మల్లిక తన భర్త ఆలోచనల నుంచి బయటకు రాలేక.. తన వెంటపడుతున్న బాలరాజుని అసహ్యించుకుంటుంది. అలాంటి మల్లిక.. బాలరాజు ప్రేమలో ఎలా పడింది? బ్రతుకు, చావు, పెళ్లి, ప్రేమ నేపథ్యంలో వీరిద్దరి మధ్య దారితీసిన పరిస్థితులు ఏంటి? అనేదే సినిమా.

అయితే థియేటర్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తే మంచి ఆదరణ తెచ్చుకుంటుంది. 72 గంటల్లో 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ ను అందుకుంది ఈ సినిమా. ఓటీటీ ఆడియన్స్ కోసం ‘చావు కబురు చల్లగా’ చిత్రాన్ని కొత్తగా ఎడిట్ చేసి విడుదల చేసారు. అనవసరమైన సన్నివేశాలను తొలగించారు. అయితే ఈ సినిమా ఓటీటీ లో మంచి ఆదరణ పొందడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

పవన్ కల్యాణ్ ‘ఖుషీ’కి ఇరవై ఏళ్లు..! ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్న జనసేన ఫ్యాన్స్‌..

Rashmika Mandanna: మేడ‌మ్ హాలివుడ్ ఎంట్రీ ఎప్పుడు.. ఆమె మాటల్లోనే తెలుసుకుందాం ప‌దండి

బాడీ షేమింగ్ గురించి ఓపెన్ అయిన ‘బర్ఫీ’ బ్యూటీ..! తన పన్నేండేళ్ల వయసు నుంచే అనుభవిస్తోందట..!

Follow Us