ఉత్తరాదిని చుట్టేసిన ‘కాషాయం ఎక్స్‌ప్రెస్’.. ఇప్పుడు దక్షిణాది డెల్టాపై గురి..!
సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ సర్క్యులేట్ అవుతోంది. మోదీ-షా అశ్వమేధ యాగం చేస్తున్నారట. ఒక్కో రాజ్యాన్ని చేజిక్కించుకుంటూ, అధికారానికి అడ్డొచ్చిన చోట, రాజకీయ యుద్ధం చేయాల్సి చోట రణరంగానికి దిగుతూ, గెలుస్తూ పోతోందట. నదుల అనుసంధానంలో భాగంగా గంగా-కావేరీని కలపాలనే ప్రతిపాదన ఉంది. బీజేపీ తన రాజకీయ అనుసంధానంలో భాగంగా ఇదే గంగా-కావేరీని లక్ష్యంగా తీసుకుంది. గంగా బెల్ట్ నుంచి కావేరీ డెల్టా వరకు.. ఆ నదులు పారే ప్రతి రాష్ట్రంలో పాగా వేయాలనేది కమలదళం టార్గెట్. ఇప్పటికే ఉత్తరాదిన గంగా-యమునా బెల్ట్‌ను క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. గంగోత్రి దగ్గర మొదలైన ఈ జైత్రయాత్ర, మొన్న బెంగాల్ కోటను దాటుకుని గంగాసాగర్‌ను ముద్దాడింది. అంటే.. గంగా బెల్ట్ ఇస్ కంప్లీట్లీ లాక్డ్! ఇప్పుడిక తన ఎక్స్‌పాన్షన్ మోడ్‌కు మరింత పదును పెట్టి, పొలిటికల్ కంపాస్‌ను సౌత్ వైపు తిప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా-గోదావరి బేసిన్ నుంచి కావేరీ వరకు.. ఈ రాష్ట్రాల ఓటు బ్యాంకును కాషాయంతో కనెక్ట్ చేయడమే మెయిన్ అజెండాగా వెళ్తోంది. ఆల్రడీ మహారాష్ట్రలో అధికారంలో ఉంది. కర్నాటకలో అధికారంలోకి వచ్చిపోయింది. ఇప్పుడిక తెలంగాణ వంతు. మే 10న మోదీ అడుగుపెడుతున్నారంటే.. మరో 'పొలిటికల్ టార్గెట్' సెట్ చేయడానికేనా! ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా విస్తరించడానికి బీజేపీ వేస్తున్న నయా స్కెచ్ ఏంటి? ఎలాంటి వ్యూహాలతో వెళ్తోంది?

ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత.. బీజేపీనే స్వయంగా రెండు చార్ట్‌లు రిలీజ్ చేసింది. ఈ దేశంలో 28 రాష్ట్రాలుంటే అందులో 17 రాష్ట్రాల్లో ఏకంగా బీజేపీ ముఖ్యమంత్రులే ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్డీయే ముఖ్యమంత్రులు కొనసాగుతున్నారు. ఇదీ.. ‘నేషన్ విత్ నమో’ అంటే అంటూ ఓ చార్ట్ విడుదల చేసింది. మరో చార్ట్ సారాంశం ఏంటంటే.. 2013లో దేశవ్యాప్తంగా కేవలం 773 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే.. ఇప్పుడు 1798 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే రెండింతలకు పైగా రైజింగ్. మామూలు ఎక్స్‌పాన్షన్ కాదిది. బట్.. టార్గెట్ ఇక్కడితోనే అయిపోలేదు, ఆగిపోలేదని చెబుతోంది బీజేపీ. నార్త్ మిషన్ ఆల్‌మోస్ట్ కంప్లీట్ కాబట్టి.. ఇక ఫోకస్ సౌత్ మీదే అని చెబుతోంది. గంగోత్రి నుంచి గంగాసాగర్.. భారతీయ జనతా పార్టీ సాధించిన అతిపెద్ద రాజకీయ విజయానికి నిదర్శనం ఇది. గంగా నది జన్మస్థానం గంగోత్రి. అది ఉన్నది ఉత్తరాఖండ్‌లో. అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీనే. అక్కడి నుంచి గంగమ్మ ప్రవహించే అన్ని ప్రధాన రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ లేదా దాని మిత్రపక్షాలే అధికారంలో ఉన్నాయి. చివరికి గంగా నది సముద్రంలో కలిసే ప్రాంతంలో కూడా బీజేపీనే. దక్షిణ బెంగాల్‌లో ఆ ప్రాంతానికి ఉన్న పేరు గంగాసాగర్. అదో పవిత్ర సంగమ ప్రదేశం. అక్కడ కూడా అధికారంలోకి వచ్చింది బీజేపీ. అంటే.. గంగా నది పరివాహక రాష్ట్రాలపై పూర్తి పట్టు సాధించింది. ఉత్తరాఖండ్‌లో బీజేపీనే. ఆ పక్కనున్న ఉత్తరప్రదేశ్‌లో ఉన్నది...
