AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా హవా తగ్గేదేలే.. నంబర్-1 స్థానంలో సూర్య సేన.. టాప్-10 జట్లు ఇవే!

ICC T20 Rankings 2026: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, తాజా జాబితాలోనూ అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. పొట్టి ఫార్మాట్‌లో భారత్ ప్రదర్శిస్తున్న నిలకడైన ఆటతీరుకు ఈ ర్యాంకింగ్స్ నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. పూర్తి వివరాలు ఓసారి చూద్దాం..

Team India: టీమిండియా హవా తగ్గేదేలే.. నంబర్-1 స్థానంలో సూర్య సేన.. టాప్-10 జట్లు ఇవే!
క్రీడా ప్రపంచంలో ప్రతిభ ఒక్కటే సరిపోదు, కొన్నిసార్లు అదృష్టం, జట్టులో ఉన్న సమీకరణాలు కూడా స్థానాన్ని శాసిస్తాయి. అఫ్గాన్ సిరీస్‌లో ఈ ముగ్గురు యువ ఆటగాళ్లు తమ శాయశక్తులా ప్రయత్నించి తామేంటో నిరూపించుకున్నారు. కానీ, భారత జట్టులో ఉన్న విపరీతమైన పోటీ, సీనియర్ల తిరుగులేని రికార్డుల కారణంగా వీరు 2027 ప్రపంచకప్ కల నెరవేరడం ప్రస్తుతానికైతే కష్టంగానే కనిపిస్తోంది. అయినా, భవిష్యత్తులో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటూ నిలకడగా రాణిస్తే కాలమే వీరికి సమాధానం చెప్తుంది.
Venkata Chari
|

Updated on: May 05, 2026 | 9:35 PM

Share

Team India No 1 T20 Team: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన భారత్, ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. టీమ్ ఇండియా మొత్తం 52 మ్యాచ్‌లు ఆడి 14,306 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం 275 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రపథాన కొనసాగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ ఈ ఫార్మాట్‌లో దూకుడుగా ఆడుతోంది. కివీస్‌పై చారిత్రాత్మక విజయం తర్వాత భారత్ రేటింగ్ మరింత మెరుగైంది.

టాప్-5లో నిలిచిన ఇతర జట్లు..

భారత్ తర్వాత రెండో స్థానంలో ఇంగ్లండ్ జట్టు నిలిచింది. ఇంగ్లీష్ జట్టు 34 మ్యాచ్‌ల్లో 8,904 పాయింట్లు సాధించి, 262 రేటింగ్‌తో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ తన దూకుడైన ఆటతీరుతో బలమైన పోటీనిస్తోంది.

ఆస్ట్రేలియా: 258 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

న్యూజిలాండ్: 247 రేటింగ్‌తో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది.

దక్షిణాఫ్రికా: 244 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానానికి, ఐదో స్థానానికి మధ్య కేవలం 4 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉండటం గమనార్హం.

మిగిలిన ఐదు స్థానాల పరిస్థితి..

ర్యాంకింగ్స్ జాబితాలో ఆరో స్థానంలో పాకిస్థాన్ (240 రేటింగ్) కొనసాగుతోంది. వెస్టిండీస్ జట్టు 233 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. మొదటి ఏడు స్థానాల్లో ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ, ఎనిమిదో స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది.

శ్రీలంక జట్టు 6 రేటింగ్ పాయింట్లను కోల్పోవడంతో 9వ స్థానానికి పడిపోయింది. ఈ పరిణామం బంగ్లాదేశ్‌కు కలిసి వచ్చింది. ఒక రేటింగ్ పాయింట్ ఆధిక్యంతో బంగ్లాదేశ్ 8వ స్థానానికి చేరుకుంది. ఇక అఫ్గానిస్థాన్ జట్టు 220 రేటింగ్ పాయింట్లతో పదో స్థానంలో తన ఉనికిని చాటుకుంది.

ఐసీసీ టీ20 టాప్-10 టీమ్స్ లిస్ట్ (మే 2026 నాటికి): 1. భారత్(275), 2. ఇంగ్లండ్ (262), 3. ఆస్ట్రేలియా( 258), 4. న్యూజిలాండ్ (247), 5. దక్షిణాఫ్రికా (244), 6. పాకిస్థాన్ (240), 7. వెస్టిండీస్ (233), 8. బంగ్లాదేశ్ (222), 9. శ్రీలంక (221), 10. అఫ్గానిస్థాన్ (220).

టీ20 ఫార్మాట్‌లో భారత్ సాధిస్తున్న ఈ విజయాలు రాబోయే సిరీస్‌లకు మరింత ఊపునిస్తున్నాయి. యువ ఆటగాళ్లతో నిండిన సూర్య సేన, అగ్రస్థానంలో కొనసాగుతుండటం భారత క్రికెట్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ర్యాంకింగ్స్‌లో వెనుకబడిన శ్రీలంక, పాకిస్థాన్ వంటి జట్లు మళ్లీ పుంజుకోవడానికి సిద్ధమవుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెట్రోల్, డీజిల్ ధరలపై బిగ్‌ అప్‌డేట్‌.. రాబోయే 10 రోజుల్లో పరిస్
పెట్రోల్, డీజిల్ ధరలపై బిగ్‌ అప్‌డేట్‌.. రాబోయే 10 రోజుల్లో పరిస్
కిస్మిస్‌ల‌ను ఇలా తిన్నారంటే,మీరు ఊహించని ఎన్నో అద్భుత‌మైన లాభాలు
కిస్మిస్‌ల‌ను ఇలా తిన్నారంటే,మీరు ఊహించని ఎన్నో అద్భుత‌మైన లాభాలు
మీరు తింటున్న చీజ్ అసలైనదేనా..? నకిలీ జున్నును ఇలా గుర్తించండి.
మీరు తింటున్న చీజ్ అసలైనదేనా..? నకిలీ జున్నును ఇలా గుర్తించండి.
ఈ రేగు పంట వేస్తే రైతుకు లాభాల పంటే..
ఈ రేగు పంట వేస్తే రైతుకు లాభాల పంటే..
యువరాజ్ సింగ్ తండ్రి వ్యాఖ్యలపై కపిల్ దేవ్ కౌంటర్ అదుర్స్..!
యువరాజ్ సింగ్ తండ్రి వ్యాఖ్యలపై కపిల్ దేవ్ కౌంటర్ అదుర్స్..!
శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే?
శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే?
ఇవి జైళ్లా లేక ఫైవ్ స్టార్ హోటళ్లా? ఇక్కడి ఖైదీల లగ్జరీ లైఫ్!
ఇవి జైళ్లా లేక ఫైవ్ స్టార్ హోటళ్లా? ఇక్కడి ఖైదీల లగ్జరీ లైఫ్!
ఒక కిలో వేరుశనగ గుండ్ల నుంచి ఎంత నూనె వస్తుంది?
ఒక కిలో వేరుశనగ గుండ్ల నుంచి ఎంత నూనె వస్తుంది?
నిప్పుల కొలిమిల నగరాలు.. కాంక్రీట్ అడవుల్లో హీట్ ముప్పు..
నిప్పుల కొలిమిల నగరాలు.. కాంక్రీట్ అడవుల్లో హీట్ ముప్పు..
లక్షలాది మందిని భావోద్వేగానికి గురిచేస్తున్న తడిసిన డైరీ..!
లక్షలాది మందిని భావోద్వేగానికి గురిచేస్తున్న తడిసిన డైరీ..!