Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Star Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్‌‌‌కు వెల్లువెత్తుతున్న విషెస్.. ఫ్యాన్స్‌‌తోపాటు సినిమాతారలు కూడా..

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. నేటితో ఈ హ్యాండ్సమ్ హీరో 46వ పడిలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం మహేష్ టాలీవుడ్ టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే...

Super Star Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్‌‌‌కు వెల్లువెత్తుతున్న విషెస్.. ఫ్యాన్స్‌‌తోపాటు సినిమాతారలు కూడా..
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 09, 2021 | 9:46 AM

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. నేటితో ఈ హ్యాండ్సమ్ హీరో 46వ పడిలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం మహేష్ టాలీవుడ్ టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌‌‌‌లో భారీ అభిమానగణం ఉన్న హీరోల్లో మహేష్ ఒకరు.మహేష్‌‌‌తో సినిమా చేయాలనీ దర్శకులు, మహేష్ సినిమాలో నటించాలని హీరోయిన్స్ ఎదురు చూస్తుంటారు.. తాజాగా మహేష్ బర్త్ డేకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మహేష్ బర్త్ డేను వరల్డ్ వైడ్ ట్రేండింగ్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఫ్యాన్స్‌‌‌‌తోపాటు సినిమాతారలు, సెలబ్రెటీలు మహేష్‌‌‌‌కు విషెస్ తెలుపుతున్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ మహేష్‌‌‌‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. అంతే కాదు మహేష్ బాబు కామన్ డీపీని తన ప్రొఫైల్ పిక్‌‌‌గా పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. మీరు సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా మందికి ఇంస్ప్రెషన్ అంటూ రాసుకొచ్చింది కీర్తి.

పరశురామ్ ట్వీట్ చేస్తూ.. ప్రతి దర్శకుడి కల మీతో పనిచేయడం.. హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు గారు అంటూ పరశురామ్ రాసుకొచ్చారు.

తమన్ మహేష్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. మేము మిమ్మల్ని మా సొంతమనిషి గా భావిస్తాం.. మెనీ మోర్ హ్యాపీస్ట్ బర్త్ డే డియర్ బ్రదర్ అంటూ ట్వీట్ చేశారు.

రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మహేష్ బాబుకు విషెస్ తెలుపుతూ.. సూపర్ డూపర్ మ్యూజికల్ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు.. మీరు ఇలానే మైండ్ బ్లాకింగ్ బర్త్ దేలు మరిన్ని జరుపుకోవాలి అని దేవీశ్రీ ట్వీట్ చేశారు.

యంగ్ హీరో అడవిశేష్ మహేష్ కువిషెస్ తెలుపుతూ.. ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రపంచమంతా మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata Blaster: పవర్ ప్యాక్ బ్లాస్టర్ వచ్చేసింది.. విశ్వరూపం చూపించిన ప్రిన్స్‌.. అభిమానులకు ఇక పండగే

సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. ఈషా అందాల ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..