Manchu Vishnu: మంచు విష్ణు ఆఫీస్‏లో చోరీ.. పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ పై కేసు నమోదు..

టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‏లో కేసు నమోదయ్యింది.

Manchu Vishnu: మంచు విష్ణు ఆఫీస్‏లో చోరీ.. పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ పై కేసు నమోదు..
Manchu Vishnu
Follow us

|

Updated on: Feb 28, 2022 | 8:12 AM

టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‏లో కేసు నమోదయ్యింది. వివరాల ప్రకారం ఈనెల 17న ఫిల్మ్ నగర్‏లో ఉన్న మంచు విష్ణు ఆఫీస్‏లో దొంగతనం జరిగింది. అతని ఆఫీస్‏లో ఉన్న విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి చోరీకి గురయ్యింది. దాదాపు రూ. 5 లక్షల వరకు విలువైన వస్తువులను అపహరించినట్లుగా తెలుస్తోంది. ఈ చోరీపై విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంచు విష్ణు వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను ఈ చోరీకి పాల్పడి ఉంటాడని.. చోరీ జరిగినప్పటి నుంచి నాగ శ్రీను కనిపించడం లేదని..విష్ణే మేనేజర్ సంజాయ్ తెలిపారు.

బోరబండకు చెందిన నాగ శ్రీను.. హీరో మంచు విష్ణు వద్ద వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్‏గా పనిచేస్తున్నాడు. ఈనెల 17న అతను మంచు విష్ణు కార్యాలయంలోని దాదాపు రూ. 5 లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ సామాగ్రిని చెప్పకుండా.. ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకెళ్లాడని… అతడిని ఫోన్‏లో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రావడం లేదని.. అలాగే చోరీ జరిగినప్పటి నుంచి అతను కనిపించడం లేదని.. విధులకు రావడం లేదని విష్ణు మేనేజర్ సంజాయ్ తెలిపారు. నాగ శ్రీనునే ఈ చోరీకి పాల్పడినట్లుగా జూబ్లీ హిల్స్ పోలీసులకు ఈనెల 19న ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Also Read: Sarkaru Vaari Paata: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న కళావతి సాంగ్.. టాలీవుడ్‏లోనే నెంబర్ వన్ రికార్డ్..

Nithiin: సౌత్ ఇండియాలోనే ఆ విషయంలో ఏకైక హీరోగా నితిన్.. బీటౌన్‏లో క్రేజ్ మాములుగా లేదుగా..

Thyroid: థైరాయిడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఈ జ్యూస్‏లతో చెక్ పెట్టొచ్చు.. అవెంటంటే..

Viral Photo: చూడగానే మైమరిపించే కళ్లు.. చూస్తూనే ఉండాలనిపించే మోము.. ఎవరో గుర్తించారా..?