Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత చిన్న వయసులోనే కథానాయికగా మారింది. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారల చైల్డ్ హుడ్ ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా తన స్కూల్ డేస్ ఫోటోను పంచుకుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ అమ్మాయి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్. తాను చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు తన క్లాస్ స్టూడెంట్స్ అంతా ఓ టీచర్ తో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇందులో నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టండి అంటూ తకన అభిమానులకు చిన్న పరీక్ష పెట్టింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ మీనా. నటిగా సినీ ప్రయాణంలో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మీనా. చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ ఈ సీనియర్ హీరోలకు సరైన జోడిగా అలరిస్తుంది.

Meena New
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
మరోవైపు యంగ్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది. ఇప్పటికే నటిగా తన సినీప్రయాణంలో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..




