AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సముద్రంపై సాహసాలు చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటుంది. అందం, అభినయంతో అడియన్స్ కు దగ్గరైన ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయిన తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే..

Tollywood: సముద్రంపై సాహసాలు చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
Actress
Rajitha Chanti
|

Updated on: Dec 08, 2024 | 2:58 PM

Share

సోషల్ మీడియాలో సినీతారలు ఎక్కువగా సందడి చేస్తుంటారు. తమ సినిమా అప్డేట్స్, పర్సనల్ విషయాలు నిత్యం షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోస్ చూసి అభిమానులు షాకవుతున్నారు. ఇప్పుడు సముద్రంపై తాను చేసిన సాహసంకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేసింది ఆ హీరోయిన్. ఇన్నాళ్లు వెండితెరపై తనదైన నటనతో మెప్పించే ఈ చిన్నది.. ఇప్పుడు సముద్రంపై ఇలాంటి సాహసాలు చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ? తనే హీరోయిన్ ఆషికా రంగనాథ్. కన్నడ సినీపరిశ్రమకు చెందిన ఈ బ్యూటీ.. 2016లో క్రేజీ బాయ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కెరీర్ తొలినాళ్లల్లో ఎక్కువగా కన్నడ సినిమాల్లోనే కనిపించింది. కానీ 2022లో తొలిసారిగా తమిళంలో ఓ ప్రాజెక్ట్ చేసింది.

పట్టతు ఆసరన్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటున్న ఈ బ్యూటీ.. తెలుగులో అమిగోస్ సినిమాతో పరిచయమైంది. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో అటు ఆషికాకు కూడా నిరాశే మిగిలింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆషికాకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత కింగ్ నాగార్జున సరసన నా సామిరంగ సినిమాతో హిట్ అందుకుంది ఆషిక. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే వచ్చాయి. కానీ ఈ సినిమా తర్వాత తెలుగులో ఆఫర్స్ మాత్రం రాలేదు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ చిత్రంలో చిరు జోడిగా త్రిష నటిస్తుంది. అటు సినిమాలు అంతగా లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు