AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : బ్యాడ్మింటన్ ప్లేయర్.. కట్ చేస్తే.. తెలుగులో తోపు హీరో.. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరంటే..

సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతుంటాయి. సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇప్పుుడు జనాల దృష్టిని తెగ ఆకర్షిస్తుంది ఓ స్టార్ హీరో త్రోబ్యాక్ పిక్. బ్యాడ్మింటన్ ప్లేయర్.. కట్ చేస్తే.. ఇప్పుడు తెలుగులో తోపు హీరో.. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

Tollywood : బ్యాడ్మింటన్ ప్లేయర్.. కట్ చేస్తే.. తెలుగులో తోపు హీరో.. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరంటే..
Sudheer Babu
Rajitha Chanti
|

Updated on: May 18, 2025 | 8:53 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అతడు తోపు హీరో. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న కుర్రాడు ఒకప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తరపున ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు.. ప్రముఖ కోచ్ పుల్లెల గోపిచంద్ తో కలిసి అప్పట్లో డబుల్స్ ఆడాడు. ఇక ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. అతి తక్కువ సమయంలోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్న కంటెంట్ చిత్రాలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇంతకీ ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ? ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోకు స్వయనా బావ. అలాగే త్వరలోనే తన కొడుకును హీరోగా వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. అతడు మరెవరో కాదండి.. టాలీవుడ్ హీరో సుధీర్ బాబు.

సుధీర్ బాబు.. తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. దివంగత నటుడు కృష్ణకు అల్లుడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు స్వయనా బావ. కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శినికి భర్త. ఒకప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సుధీర్ ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏమాయ చేసావే సినిమాలో సమంతకు అన్నగా కనిపించాడు. ఆ తర్వాత ఎస్ఎమ్ఎస్ సినిమాతో హీరోగా మారారు. మొదటి సినిమాతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. తెలుగులో సమ్మోహనం, ప్రేమకథాచిత్రమ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు.

తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ హీరోగా మెప్పిస్తున్నాడు సుధీర్ బాబు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటున్నారు. ప్రియదర్శిని, సుధీర్ బాబు దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిలో పెద్ద తనయుడు త్వరలోనే సినీరంగంలోకి అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే..ప్రస్తుతం సోషల్ మీడియాలో సుధీర్ బాబు షేర్ చేసిన ఈ ఫోటో తన తొలి ఫోటోషూట్ అని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Sudheer Babu (@isudheerbabu)

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్