Tollywood: స్టార్ హీరోలతో సినిమాలు.. అయినా రాని ఫాలోయింగ్.. దెబ్బకు సినిమాలకు దూరంగా..
సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో తెరపైకి వచ్చింది. బొద్దుగా.. ముద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. కానీ అదృష్టమే కలిసి రాలేదు.

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు సినీరంగంలో సరైన బ్రేక్ రాలేదు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. కానీ ఈ అమ్మడుకు మాత్రం సరైన క్రేజ్ రాలేదు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో మెరిసిన ఈ వయ్యారి.. నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. స్టార్ హీరోయిన్ గా కాకుండా.. సెకండ్ కథానాయికగానూ మెరిసింది. కానీ ఈ బ్యూటీకి ఎందుకోగానీ ఈ ముద్దగుమ్మకు స్టార్ డమ్ రాలేదు. తెలుగులో అల్లు అర్జున్, గోపిచంద్, రానా, సిద్ధార్థ్, విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్ వంటి స్టార్ హీరోలకు జోడిగా కనిపించింది. కానీ అంతగా బ్రేక్ రాకపోవడంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యింది.
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ క్యాథరిన్ ట్రెసా. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమ్మాయి. ఇద్దరమ్మాయిలు, సరైనోడు, బింబిసార వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వరుణ్ సందేశ్ నటించిన చమ్మక్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమాలో మెరిసింది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీకి మాత్రం క్రేజ్ రాలేదు.
ఇదిలా ఉంటే.. గత రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది క్యాథరిన్. చివరగా 2022లో రిలీజ్ అయిన నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రంలో కనిపించింది. ఇటీవలే తనకు ఉన్న ఓ వింత జబ్బును బయట పెట్టి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నెట్టింట యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..