AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ద్యావుడా.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఎలా మారిందో చూశారా.. ? చూస్తే మైండ్ బ్లాంకే..

తెలుగు, తమిళం, హిందీలో పలు చిత్రాల్లో నటించి స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆ హీరోయిన్ రేర్ ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు ఎంతో పద్దతిగా గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్న ఆ హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీ అని తెలిసి షాకవుతున్నారు. ఇంతకీ ఆ సినీతార ఎవరో తెలుసుకుందామా.. పైన ఫోటోను చూశారు కదా.. అందులో పెద్ద బొట్టు, సంప్రదాయ పద్దతిలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు ఫేమస్ హీరోయిన్.

Tollywood: ద్యావుడా.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఎలా మారిందో చూశారా.. ? చూస్తే మైండ్ బ్లాంకే..
Actress 2
Rajitha Chanti
|

Updated on: May 30, 2024 | 11:52 AM

Share

సాధారణంగా సోషల్ మీడియాలో హీరోయిన్స్ త్రోబ్యాక్ ఫోటోస్ తెగ హల్చల్ చేస్తుంటాయి. ఇటీవల టాలీవుడ్ టూ బాలీవుడ్ తారల రేర్ పిక్చర్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇక తమ అభిమాన సినీతారల గురించి తెలుసుకోవడానికి..వారి చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసేందుకు నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పాన్ ఇండియా మూవీ లవర్స్ హృదయాలను దొచుకున్న హీరోయిన్ రేర్ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళం, హిందీలో పలు చిత్రాల్లో నటించి స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆ హీరోయిన్ రేర్ ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు ఎంతో పద్దతిగా గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్న ఆ హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీ అని తెలిసి షాకవుతున్నారు. ఇంతకీ ఆ సినీతార ఎవరో తెలుసుకుందామా.. పైన ఫోటోను చూశారు కదా.. అందులో పెద్ద బొట్టు, సంప్రదాయ పద్దతిలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు ఫేమస్ హీరోయిన్.

కొన్నిరోజులుగా ఈ అమ్మడు పేరు నెట్టింట తెగ వినిపిస్తుంది. అలాగే ఇటీవల ఆ బ్యూటీ నటించిన వెబ్ సిరీస్ విజయవంతంగా దూసుకుపోతుంది. ఇంతకీ ఆ తార ఎవరో గుర్తుపట్టగలరా.. ? తనే హీరోయిన్ అదితి రావు హైదరీ. సౌత్ టూ నార్త్ సినీ ప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. తెలుగు, తమిళం, హిందీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన బ్లాక్ బస్టర్ హిట్ వెబ్ సిరీస్ హీరామండిలో కీలకపాత్ర పోషించింది. ఇందులో అదితి నటనకు, డాన్స్ కు ఫిదా అయిపోయారు అడియన్స్. ముఖ్యంగా గజ్ గామిని నడకతో సంచలనం సృష్టించింది. ఈ సిరీస్ తో అటు నార్త్ ఇండస్ట్రీలోనూ అదితి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

తెలుగులో అదితి చివరిసారిగా మహా సముద్రం సినిమాలో నటించింది. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణలో సిద్ధార్థతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థ వేడుక వనపర్తిలోని రంగనాయక ఆలయంలో జరిగింది. ప్రస్తుతం అదితికి సంబంధించిన రేర్ ఫోటో నెట్టింట వైరలవుతుంది. అదితి వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వర రావుకు మనవరాలు. అలాగే అస్సాం మాజీ గవర్నర్ మహ్మద్ సాలెహ్ అక్బర్ హైదరి మనవరాలు కూడా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.