Inter Results 2026: వాట్సప్‌లోనే ఇంటర్ ఫలితాలు.. జస్ట్ ఈ ఒక్క మెస్సేజ్ పెడితే చాలు.. సెకన్లలోనే రిజల్ట్స్ మీ చేతికి..
తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. వాట్సప్‌లో ఇంటర్ ఫలితాలను పొందవచ్చు. ఈ మేరకు రేవంత్ సర్కార్ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్, సెకండియర్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. దీంతో 10 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తోంది. దీంతో పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో తమ ఫలితాలను చెక్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ అన్నీ ఒకేసారి విడుదల చేయనుంది. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా రిజల్ట్స్ కోసం ఆసక్తితో చూస్తున్నారు. అయితే రకరకాల మార్గాల ద్వారా విద్యార్థులు రిజల్ట్స్‌ను చూసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం వెబ్ సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక దీంతో ఈ పాటు ఈసారి తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ సేవలను కూడా ప్రారంభించింది. దీంతో వాట్సప్‌లోనే విద్యార్థులు తమ రిజల్ట్స్ పొందవచ్చు. సులువుగా విద్యార్థులు ఫలితాలను పొందేందుకు వాట్సప్ ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాట్సప్ ద్వారా ఎలా పొందాలి..?
-8096958096 ఫోన్ నెంబర్‌ను మీ ఫోన్‌లో ముందుగా సేవ్ చేసుకోవాలి
-ఆ తర్వాత మీ వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ పెట్టండి
-ఆ తర్వాత ‘BIE Exam Result’ అని టైప్ చేయండి
-స్టార్ట్ సర్వీస్ అనే ఆప్షన్ ఎంచుకోండి
-Telangana BIE Results విండో ఓపెన్ అవుతుంది
-చెక్ రిజల్ట్ మీద క్లిక్ చేయండి
-హాల్ టికెట్ నెంబర్, ఇయర్, స్ట్రీమ్ వివరాలు నమోదు చేయండి
-గెట్ రిజల్ట్‌పై క్లిక్ చేయండి
-మీ రిజల్ట్స్ మీకు వాట్సప్‌లోనే వస్తాయి
వెబ్ సైట్ ద్వారా..
-https://tgbie.cgg.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయండి
-ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అనేది సెలక్ట్ చేసుకోండి
-విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయండి
-మీ రిజల్ట్స్ మీకు స్క్రీన్‌పై కనిపిస్తాయి. దానిని ప్రింటవుట్ తీసుకోండి
-https:// results.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు
-ఇక మీ సేవ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లి చెక్ చేసుకోవచ్చు
ఫలితాలు ఎప్పుడంటే..?
ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విడుదల చేయనున్నారని తెలుస్తోంది. రిజల్ట్స్ విడుదల చేయగానే వెబ్ సైట్లో అందుబాటులోకి రానున్నాయి. దీంతో విద్యార్థులు వెంటనే చెక్ చేసుకోవచ్చు. దాదాపు 10 లక్షల మందిపై విద్యార్థులు ఇంటర్ ఎగ్జామ్స్ రాశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగాయి. ఇక సప్లిమెంటరీ పరీక్షలు మేలో జరిగే అవకాశముంది.
