AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం మత్తులో దారుణం.. భార్యతో గొడవ వద్దన్నందుకు తల్లిని కడతేల్చిన కసాయి కొడుకు..!

జగిత్యాల జిల్లాలో క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్యతో గొడవ పడుతుండగా.. అడ్డుకోబోయిన తల్లిపై దాడి చేశాడు ఓ వ్యక్తి. తీవ్రంగా గాయపడ్డ 90 ఏళ్ల వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. మల్లాపూర్ మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మద్యం మత్తులో దారుణం..  భార్యతో గొడవ వద్దన్నందుకు తల్లిని కడతేల్చిన కసాయి కొడుకు..!
Jagityal Murder
G Sampath Kumar
| Edited By: |

Updated on: Apr 11, 2026 | 7:45 PM

Share

జగిత్యాల జిల్లాలో క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్యతో గొడవ పడుతుండగా.. అడ్డుకోబోయిన తల్లిపై దాడి చేశాడు ఓ వ్యక్తి. తీవ్రంగా గాయపడ్డ 90 ఏళ్ల వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. మల్లాపూర్ మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు సొంత తల్లినే హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపేట్టారు.

స్థానిక సమాచారం మేరకు, నంబయ్య అనే వ్యక్తి అర్ధరాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తన భార్య లక్ష్మితో వాగ్వాదానికి దిగాడు. ఇంట్లో గొడవ జరుగుతుండగా అడ్డుకోబోయిన అతని తల్లి వెంకవ్వ (90)పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నీ వల్లే మా మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ ఆవేశంతో కట్టెతో తలపై బలంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన వెంకవ్వ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ కలహాలు, మద్యం మత్తు ఎంతటి విషాద ఘటనలకు దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి స్పష్టంచేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us