TS Inter Results 2026: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా మార్క్స్ ఈజీగా చెక్ చేసుకోండి..
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్! ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ రిజల్ట్స్ నేడే విడుదలవుతున్నాయి. సరిగ్గా 11 గంటలకి మీ మార్కులు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తాయి. సర్వర్ బిజీగా ఉన్నప్పుడు కూడా మీ ఫలితాలు ఈజీగా ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం!

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫలితాల వెల్లడికి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఈరోజు (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని విద్యాభవన్‌లో విడుదల చేయనున్నారు. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం (First Year) విద్యార్థులు 4,89,126 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరం (Second Year) నుంచి 5,07,949 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు ఫలితాలతో తేలిపోనుంది. జనరల్, వొకేషనల్ విభాగాల ఫలితాలు ఒకేసారి అందుబాటులోకి రానున్నాయి.
ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు తమ మార్కులను tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in వెబ్‌సైట్ల ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. TV9 వెబ్‌సైట్‌లో మీరు నేరుగా ఫలితాలు తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు అధికారులు తెలిపారు.
