AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ప్రయాణాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope in Telugu (April 12, 2026): ఆదివారం రాశిఫలాల ప్రకారం మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు, ఆర్థికంగా మెరుగుదల, కుటుంబ సహకారం చాలా రాశుల వారికి కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, నిరుద్యోగులకు అవకాశాలు, వ్యక్తిగత సమస్యల పరిష్కారం వంటి అనుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే కొందరు ఆరోగ్యం, ప్రయాణాలు, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం.

Horoscope Today: ప్రయాణాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Rashifal In Telugu 12 April 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 12, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (ఏప్రిల్ 12, 2026): మేష రాశి వారు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృషభ రాశి వారికి కొద్ది ప్రయత్నంతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఆర్థిక విషయాల్లో సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ప్రయత్న లోపం ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పట్టుదలగా పనులన్నీ పూర్తి చేస్తారు. వినోద యాత్రకు ప్లాన్ చేస్తారు. వృత్తిపరంగా సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాలి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కొద్ది ప్రయత్నంతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు పనికి వస్తాయి. ఆస్తి వివాదంలో తోబుట్టువులతో రాజీ మార్గం అనుసరిస్తారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి అనుకున్న సమాచారం అందుతుంది. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పరిష్కరించుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా, అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు గడిస్తారు. అన్ని విధాలుగానూ ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ, ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహనాలతో అప్రమత్తంగా ఉండాలి. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. శుభవార్తలు వింటారు. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఆర్థికంగా అదృష్టం కలిసి వచ్చే సూచనలున్నాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. కుటుంబ సభ్యులలో ఒకరు చదువులు లేదా ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే సూచనలున్నాయి. అనుకోకుండా వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమయి, మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. పెళ్లి సంబంధానికి సంబంధించి బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, మీ చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. మిత్రుల బాగా ఎంజాయ్ చేస్తారు. తోబుట్టువులతో ఆస్తి వివాదం గురించి సంప్రదిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. బంధువుల రాకపోకలుంటాయి. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా బాగా కలిసి వచ్చే సమయం ఇది. కొద్ది ప్రయత్నంతో ముఖ్య మైన కార్యకలాపాలన్నీ పూర్తవుతాయి. ఆర్థికపరంగా కూడా అదృష్టం పడుతుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. శుభకార్యంలో పాల్గొంటారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారాలు విస్తరించుకోవడానికి, ఉద్యోగం మారేందుకు ప్రయత్నాలు చేయడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ, అత్యవసరమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి నిపుణులకు కలిసి వచ్చే సమయం ఇది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. చదువుల్లో పిల్లలు విజయాలు సాధిస్తారు.

Follow Us