AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: కాల్ చేస్తే చావే.. గుండె ఆగిపోయే సస్పెన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్..

వీకెండ్ వచ్చేసింది.. అందుకే ఇప్పుడు ఓటీటీలో కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ విడుదలవుతున్నాయి. హారర్ థ్రిల్లర్, సస్పెన్స్, క్రైమ్, రొమాంటిక్ ఇలా డిఫరెంట్ జానర్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. నిత్యం సరికొత్త జానర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ వేదికపైకి వచ్చేసింది.

OTT Movie: కాల్ చేస్తే చావే.. గుండె ఆగిపోయే సస్పెన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్..
The Call Movie
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2026 | 6:56 AM

Share

ఓటీటీ సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వీకెండ్ మరింత ఆసక్తికరంగా మారేందుకు ఇప్పుడు మరో కొత్త హారర్ థ్రిల్లర్ మీ ముందుకు వచ్చింది. ఎప్పటికప్పుడు సరికొత్త సస్పెన్స్ డ్రామాలను అందించే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీని రిలీజ్ చేసింది. ఇది హారర్ థ్రిల్లర్ మాత్రమే కాదండోయ్ వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో భయపెట్టే సినిమా. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ది కాల్. అమెరికన్ హారర్ థ్రిల్లర్. దాదాపు ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శనివారం (ఏప్రిల్ 11) నుంచి ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషలలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..

ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోనూ చూడొచ్చు. థియేటర్లలో విడుదలైన ఐదేళ్లకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 2020 అక్టోబర్ 2న థియేటర్లలో భారీ అంచనాల విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టిమోతీ వుడ్ వర్డ్ జూనియర్ డైరెక్టర్. ఇందులో లిన్ షేయ్, టాబిన్ బెల్, రషింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

సినిమా కథ విషయానికి వస్తే.. ఓ గ్రామంలో టీచర్ గా పనిచేసి రిటైర్డ్ అవుతుంది ఎడిత్ క్రాన్స్ టన్ అనే మహిళ. అయితే ఆమె మాంత్రికురాలు అని అక్కడి ఊర్లోని పిల్లలు అనుమానుస్తూ ఆమెపై నిత్యం దాడి చేస్తూ వేధిస్తుంటారు. క్రిస్, టోంకా, బ్రూనో, జాక్ అనే నలుగురు ఫ్రెండ్స్ వేధింపులతో ఆమె సూసైడ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె భర్త ఆ నలుగురిని తన ఇంటికి రమ్మంటాడు. తన భార్య చనిపోయే ముందు వీలునామా రాసిందని.. ఒక సవాలు పూర్తి చేస్తే భారీగా డబ్బు ఇస్తానని చెబుతాడు. పైన అంతస్తులో ఉన్న పాత ఫోన్ బూత్ లోకి వెళ్లి అక్కడ ఉన్న నంబర్ కు కాల్ చేయాలి. దాదాపు 60 సెకన్లపాటు కాల్ కట్ చేయకుండా ఉండాలి. అయితే ఆ ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా పైకి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..

Follow Us