AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : స్టార్ హీరోహీరోయిన్లు లేరు.. గ్లామర్ పాటలు లేవు.. బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..

కన్నడలో చిన్న చిత్రంగా విడులై బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమా ఓటీటీ హక్కులపై వస్తున్న రూమర్స్‌కు మేకర్స్ చెక్ పెట్టారు. ప్రస్తుతానికి డిజిటల్ డీల్స్ ఏవీ కుదుర్చుకోలేదని, ప్రేక్షకులు ఈ అందమైన ప్రేమకథను కేవలం బిగ్ స్క్రీన్ పైనే ఆస్వాదించాలని కోరారు.

Cinema : స్టార్ హీరోహీరోయిన్లు లేరు.. గ్లామర్ పాటలు లేవు.. బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
Premada Oorali
Rajitha Chanti
|

Updated on: Oct 14, 2026 | 1:54 PM

Share

కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒక చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ‘ప్రేమద ఊరలి’ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హీరో శ్రీరామ్, టెర్రిఫిక్ యాక్టర్ రంగాయణ రఘు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఏకంగా రూ. 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఈ చిత్రంలో తపస్విని పూణచ్ఛ, రామిక శివు ఇతర కీలక పాత్రల్లో నటించగా, మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఎంబీఏ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ విలేజ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాలోని ఎమోషనల్ సీన్స్, సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మౌత్ టాక్‌తో కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. రూరల్ ప్రాంతాల్లో అయితే ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయవంతం కావడంతో, ఓటీటీ ప్రియులు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల రూమర్స్‌కు మేకర్స్ చెక్ పెట్టారు. ప్రస్తుతానికి తాము ఏ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తోనూ లేదా శాటిలైట్ ఛానెల్‌తోనూ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని లీడ్ యాక్టర్ శ్రీరామ్ అధికారికంగా స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?

ప్రేక్షకులు ఈ అందమైన ప్రేమకథను, తండ్రీకొడుకుల భావోద్వేగ బంధాన్ని కేవలం బిగ్ స్క్రీన్ పైనే అనుభవించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. థియేట్రికల్ రన్ ముగిసే వరకు డిజిటల్ రిలీజ్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ ఓటీటీ డేట్ ఫిక్స్ అయితే అధికారిక ప్రకటన వెలువరిస్తామని స్పష్టం చేశారు. మొత్తానికి ఈ విజువల్ వండర్‌ను ఆస్వాదించాలంటే అభిమానులు ఇంకొంతకాలం థియేటర్లకే వెళ్లాల్సిందే!

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

Follow Us
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానానికి 7500 కోడ్.. కాసేపటికే..
గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానానికి 7500 కోడ్.. కాసేపటికే..
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు..
నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు..