AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!

Saturn Transit in Uttara Bhadra 2026: శని గ్రహం రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారానికి జ్యోతిష్య శాస్త్రం రీత్యా చాలా ప్రాధాన్యత ఉంటుంది. శనిదేవుడు 2026 అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించారు. 2027 ఫిబ్రవరి 8 వరకు ఈ నక్షత్రంలో కొనసాగుతారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శ్రమకు తగిన ఫలితాలు దక్కుతాయి. ఉద్యోగంలో పురోగతి, వ్యాపార అవకాశాలు, ఆర్థికంగా మెరుగుపడే పరిస్థితులు ఏర్పడవచ్చని జ్యోతిష్యశాస్త్రం సూచిస్తోంది.

శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
Saturn Star Transit 2026
Janardhan Veluru
|

Updated on: Oct 14, 2026 | 1:26 PM

Share

శని నక్షత్ర సంచారం 2026: జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడిని కర్మఫల ప్రదాతగా, న్యాయానికి ప్రతీకగా భావిస్తారు. వ్యక్తి చేసే పనులను బట్టి శని ఫలితాలను అందిస్తాడని జ్యోతిష్య నమ్మకం. అందుకే శని గ్రహం రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో (Saturn Transit in Uttara Bhadra 2026) సంచరిస్తున్నారు. ఈ సంచారం 2027 ఫిబ్రవరి 8 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి. ఆదాయం పెరిగే అవకాశాలు రావడం, కొత్త పరిచయాలు ఏర్పడటం వంటి పరిణామాలకు అవకాశం ఉంది. మరి శని నక్షత్ర సంచారం వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉన్న ఆ మూడు రాశులు ఏవో తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రాశి వారికి శని ఉత్తరాభాద్ర నక్షత్ర సంచారం అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. చాలాకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ఉన్నతాధికారుల గుర్తింపు పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు తలుపుతట్టుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నవారు సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో క్రమంగా అనుకూల పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి అదృష్టం కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ, వృత్తి రంగాల్లో కొత్త అవకాశాలు లభించడంతో పాటు, కష్టానికి తగిన గుర్తింపు దక్కుతుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం వల్ల భవిష్యత్తులో ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభించడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమ, వ్యక్తిగత సంబంధాల్లో సంతోషకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. వ్యాపారులకు కొత్త పరిచయాల ద్వారా లాభదాయకమైన అవకాశాలు పొందుతారు.

ఇవి కూడా చదవండి

మకర రాశి

మకర రాశి వారికి శని నక్షత్ర సంచారం ఆర్థికంగా పురోగతి సాధించేందుకు దోహదపడుతుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపించవచ్చు. ఉద్యోగులు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలను పొందుతారు. కార్యాలయంలో బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం ద్వారా ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఎక్కడైనా డబ్బు నిలిచిపోయి ఉంటే, దానికి సంబంధించిన వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించాలని చూస్తున్నవారికి అనుకూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా, పరిస్థితులను పూర్తిగా పరిశీలించడం మంచిది.

(గమనిక: ఈ కథనంలోని రాశిఫలాలు జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిని శాస్త్రీయంగా నిర్ధారితమైన ఫలితాలుగా భావించకూడదు.)

Follow Us
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..
సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..
ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?
ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?
క్రికెటర్ కాకపోతే బుమ్రా ఏం చేసేవాడో తెలుసా ?
క్రికెటర్ కాకపోతే బుమ్రా ఏం చేసేవాడో తెలుసా ?
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
భారత పారిశ్రామిక, డిజిటల్‌ విప్లవంలో 'రిలయన్స్' చెరగని ముద్ర
భారత పారిశ్రామిక, డిజిటల్‌ విప్లవంలో 'రిలయన్స్' చెరగని ముద్ర
కరువు మండలాలు ప్రకటించారు.. రైతులకు సాయం దక్కేది అప్పుడేనా..?
కరువు మండలాలు ప్రకటించారు.. రైతులకు సాయం దక్కేది అప్పుడేనా..?