AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతర పంటలతో అద్భుతాలు.. వినూత్న సాగుతో జాతీయ అవార్డు నెగ్గిన జగిత్యాల మహిళా రైతు!

వ్యవసాయంలో వినూత్న పద్ధతులను అనుసరిస్తూ తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధిస్తున్న జగిత్యాల జిల్లా మహిళా రైతుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన బండారి విజయ ప్రతిష్ఠాత్మకమైన మహిళా కిసాన్ దివస్ అవార్డుకు ఎంపికయ్యారు. ఎకరం విస్తీర్ణంలోనే 14 రకాల కూరగాయలను సాగు చేస్తూ, అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందుతూ విజయ సాధిస్తున్న తీరు ఆమెను ప్రత్యేకంగా నిలిపింది.

అంతర పంటలతో అద్భుతాలు.. వినూత్న సాగుతో జాతీయ అవార్డు నెగ్గిన జగిత్యాల మహిళా రైతు!
Bandari Vijaya Wins National Award For High Yield Farming
G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 14, 2026 | 1:43 PM

Share

మహిళా రైతులను ప్రోత్సహించడం, వ్యవసాయ రంగంలో వారు సాధిస్తున్న విజయాలను గుర్తించడం లక్ష్యంగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏటా అక్టోబరు 15న మహిళా కిసాన్ దివస్‌ను నిర్వహిస్తూ అవార్డులను అందిస్తోంది. ఇందులో భాగంగా విభిన్న సాగు పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం, తక్కువ భూమిలో అధిక దిగుబడుల సాధన, వ్యవసాయం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే విధానాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మహిళా రైతులను ఎంపిక చేస్తారు.

పెంబట్లకు చెందిన బండారి విజయ తనకున్న ఎకరం భూమిలో 14 రకాల కూరగాయలను సాగు చేస్తూ వ్యవసాయంలో వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఒకే పంటపై ఆధారపడకుండా విభిన్న రకాల కూరగాయలను పండించడం, అంతర పంటల సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడం వంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. పరిమిత భూమిని సమర్థంగా వినియోగించుకుంటూ, సాగులో కొత్త విధానాలను ఆచరిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

విజయ అనుసరిస్తున్న వినూత్న వ్యవసాయ పద్ధతులు, తక్కువ విస్తీర్ణంలో విభిన్న పంటల సాగు, ఆదాయాన్ని పెంచుకునే విధానాలను గుర్తించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆమె పేరును మహిళా కిసాన్ దివస్ అవార్డుకు ప్రతిపాదించారు. అధికారుల ప్రతిపాదనను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను అవార్డుకు ఎంపిక చేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో బండారి విజయకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వినూత్న సాగు పద్ధతులతో ముందుకు సాగితే తక్కువ భూమిలోనూ మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆమె వ్యవసాయ ప్రయాణం చాటిచెబుతోంది. మహిళా రైతులకు ప్రోత్సాహం అందించడంతో పాటు, ఇతర రైతులు కూడా విభిన్న పంటల సాగు వైపు దృష్టి సారించేందుకు ఈ గుర్తింపు స్ఫూర్తినివ్వనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానానికి 7500 కోడ్.. కాసేపటికే..
గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానానికి 7500 కోడ్.. కాసేపటికే..
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు..
నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు..
వినూత్న సాగుతో జాతీయ అవార్డు నెగ్గిన జగిత్యాల మహిళా రైతు!
వినూత్న సాగుతో జాతీయ అవార్డు నెగ్గిన జగిత్యాల మహిళా రైతు!
బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో
బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..