AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..

Telugu SEO Excerpt: మేక లేదా గొర్రె బోటితో తయారుచేసే బోటి కూరను చాలామంది ఇష్టంగా తింటారు. ఇందులో ప్రోటీన్‌, ఐరన్‌, విటమిన్‌ బి12 వంటి పోషకాలు ఉంటాయి.. అయితే బోటి కూర తినడం వల్ల అలసట తగ్గుతుందని, జుట్టు పెరుగుదల మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు డైటీషియన్లు.. బోటి స్టామినా, కండరాల బలం, జ్ఞాపకశక్తి పెంచుతుందని పేర్కొంటున్నారు.

వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
Mutton Boti Benefits
Shaik Madar Saheb
|

Updated on: Oct 14, 2026 | 1:31 PM

Share

చికెన్, మటన్‌ను నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తింటారు. ముఖ్యంగా.. కర్రీ, ఫ్రైతోపాటు.. పలు రకాలుగా వండుకుని తింటారు. అయితే, మేక మాంసంలో ప్రతి భాగం ప్రత్యేకమైనదే.. లివర్, తలకాయ, కాళ్లు, బోటి.. ఇలా అన్ని కూడా ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి.. అయితే.. నాన్‌వెజ్ తినే వారిలో చాలామంది ఇష్టంగా తినే వంటకాల్లో బోటి కర్రీ ఒకటి. ఈ మేక లేదా గొర్రె బోటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చాలామందికి తెలియదు. బోటిలో అధికంగా ప్రోటీన్, ఫ్యాట్స్ ఉంటాయి.. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఎప్పుడూ అలసటగా, బలహీనంగా అనిపించే వారికి బోటి ఒక వరం లాంటి ఆహారం.. అందుకే.. బోటి కూరను వారానికి లేదా పదిరోజులకు ఒకసారి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు పెద్దలు..

బోటీలో ఎన్నో పోషకాలు..

వాస్తవానికి బోటి కూరలో శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, ఐరన్, ఫైబర్ తోపాటు విటమిన్ బి12, విటమిన్ ఎ, ఇ, కె ఉంటాయి. అందుకే.. నాన్ వెజ్ ప్రియులు ముఖ్యంగా.. మటన్ తినే వారు బోటి కూరను ఇష్టంగా తింటారు.

జిమ్‌కు వెళ్లి లేదా వర్కౌట్స్ చేసేవారికి కండరాల బలం పెరగడానికి బోటి ఒక ఉత్తమమైన ఆహారం. బోటిలో ఉండే జింక్ చర్మం ప్రకాశవంతంగా మారడానికి.. జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.

విటమిన్ B12 మెమరీ పవర్ ను పెంచి, మెదడును చురుకుగా ఉంచుతుంది. శరీరంలో ప్రతి కణానికి, ముఖ్యంగా నరాల వ్యవస్థకు సహాయపడేలా చేస్తుంది. అంతేకాకుండా.. నరాల బలహీనతను నివారిస్తుంది.

అలాగే, బోటిలో పుష్కలంగా ఉండే ఐరన్ రక్త స్థాయిలు పెరగడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా మంచిది.

బోటి కర్రీలో ఉండే ప్రోబయోటిక్స్ మన గట్ హెల్త్ కి, జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా మంచిది. సన్నగా ఉండేవాళ్లు త్వరగా బరువు పెరగాలనుకుంటే, బోటి కర్రీ బెస్ట్ ఫుడ్ అని డైటీషియన్లు సూచిస్తున్నారు.

వీరికి మాత్రం ప్రమాదం..

అయితే, బోటి కర్రీని పరిమితికి మించి తింటే కొలెస్ట్రాల్ గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు (బీపీ) ఉన్నవాళ్లు ఈ బోటి కర్రీని అస్సలు తినకూడదు. సరైన మోతాదులో తీసుకుంటే బోటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. కానీ జాగ్రత్త లేకపోతే నష్టం కూడా కలిగించవచ్చని పేర్కొంటున్నారు.. అయితే.. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Follow Us
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..
సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..
ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?
ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?
క్రికెటర్ కాకపోతే బుమ్రా ఏం చేసేవాడో తెలుసా ?
క్రికెటర్ కాకపోతే బుమ్రా ఏం చేసేవాడో తెలుసా ?
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
భారత పారిశ్రామిక, డిజిటల్‌ విప్లవంలో 'రిలయన్స్' చెరగని ముద్ర
భారత పారిశ్రామిక, డిజిటల్‌ విప్లవంలో 'రిలయన్స్' చెరగని ముద్ర