AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి రెడీ.. ఈ రూటు ఫిక్స్ చేసిన రైల్వేశాఖ.. అప్డేట్ వచ్చేసింది..

వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు గుడ్ న్యూస్. రెండో రైలు పట్టాలెక్కేందుకు రెడీ అయింది. ఈ మేరకు రూట్ ఫిక్స్ కాగా.. త్వరలో షెడ్యూల్, ధరలను ప్రకటించనున్నారు. రెండో రైలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రయాణికులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. తొలి రైలు జనవరిలో ప్రారంభమైంది.

Indian Railways: మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి రెడీ.. ఈ రూటు ఫిక్స్ చేసిన రైల్వేశాఖ.. అప్డేట్ వచ్చేసింది..
Vande Bharat Sleeper Trains
Venkatrao Lella
|

Updated on: Apr 12, 2026 | 8:51 AM

Share

వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ ఏడాది జనవరిలో తొలి స్లీపర్ రైలును ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించగా.. రెండో రైలు ఎప్పుడు వస్తుందనే దానిపై ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు రెండో వందే భారత్ స్లీపర్ రైలుపై కీలక ప్రకటన వచ్చేసింది. తొలి రైలుకు ప్రయాణికుల నుంచి అద్బుత స్పందన రావడం, ఆక్సుపెన్సీ పెరుగుతున్న క్రమంలో రెండో రైలును కూడా ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సిద్దమైంది. రెండో వందే భారత్ స్లీపర్ రైలుకు తాజాగా ఆమోదం లబించింది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.

ఈ ప్రాంతాల మధ్య సర్వీసులు

రెండో వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరు-ముంబై మధ్య తిప్పాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ నెల 5న బెంగళూరు సెంట్రల్ ఎంపీ మోహన్‌కు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లేఖ రాశారు. ఈ లేఖలో విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఎక్కడెక్కడ ఇది ఆగుతుంది.. టైమ్ షెడ్యూల్స్ ఏంటి.. ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. కేవలం ఏ ప్రాంతాల మధ్య తిరుగుతుందనేది మాత్రం స్పష్టత వచ్చింది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశముంది. ఇక టికెట్ ధరలను కూడా త్వరలో ప్రకటించేందుకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. దూరపు ప్రయాణాల కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ముంబై-బెంగళూరు మధ్య ప్రయాణానికి 22 గంటల సమయం పడుతుంది. వందే భారత్ స్లీపర్ రాకతో 16 గంటలకు సమయం తగ్గనుంది.

రైలు ప్రత్యేకతలు

కాగా తొలి రైలును జనవరి 17న ప్రధాని మోదీ ప్రారంభించారు. పశ్చిమబెంగాల్‌లోని హౌరా నుంచి అస్సాంలోని గువహతి వరకు ఇది సర్వీసులు అందిస్తోంది. దీని వేగం గంటకు 180 కిలోమీటర్లు కాగా.. మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో మొత్తం ఏసీ స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. ఇక సీసీటీవీ కెమెరాలు, మెరుగైన కుషనింగ్, అత్యాధునిక టాయిలెట్లు, సౌండ్ సిస్టమ్ వంటివి ఉంటాయి. విమానం తరహాలో ఇందులో సౌకర్యాలు ఉంటాయి. కనీస ఛార్జి రూ.960 నుంచి ప్రారంభం అవుతుండగా.. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులను అనుమతించరు. ఇక ఆర్‌ఏసీ ప్రయాణికులకు కూడా పర్మిషన్ ఉండదు. కేవలం కన్పార్మ్‌డ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక టికెట్‌తో పాటు ఉచితంగా ఫుడ్ అందిస్తారు. దీంతో పుడ్ ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇక రెండో రైలు కూడా ఇదే ఫీచర్లతో ఉండనుంది.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర