Ghani: నెట్టింట్లో గని స్పెషల్ సాంగ్ రచ్చ.. వరుణ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ అంటూ..
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్‌కు

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తుండగా.. సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు ‘గని’పై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గని సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. ఈ సినిమాను మార్చి 18న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు గని సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. నిన్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఐటెం పోస్టర్ రివీల్ చేస్తూ అందులో నటించే హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ గా ఉంచారు. ఆ హీరోయిన్ ఎవరనేది కనిపెట్టాలంటూ ప్రేక్షకులను కోరారు. ఇంకేముందు గని సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోయేది ఆ హీరోయిన్.. ఈ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నటించే హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా అంటూ ఎక్కువ శాతం నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండగా… మరికొందరు సమంత అంటున్నారు. ఈ పాటకు సంబంధించిన పూర్తి పోస్టర్‌ను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. మరి చూడాలి ఇందులో ఐటెం సాంగ్ లో ఎవరు కనిపించనున్నారనేది. ఈ సినిమాలో నవీన్ చంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నదియా మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
Guess who is going to sizzle for this special song? ??#Ghani ? Keep Guessing, Drop in your comments now! ?@IAmVarunTej @IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @RenaissanceMovi @adityamusic pic.twitter.com/sZ3GBnqPnX
— Geetha Arts (@GeethaArts) January 11, 2022
Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..




